ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!

కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉండడంతోవ్ గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని సందిగ్ధంలో ఉన్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇక వినాయక చవితి పండుగ అంటే అధిక మంది జనాలు గుమిగూడితారు కాబట్టి ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం మంచిదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.ఇక గత సంవత్సరం మాదిరే తమ ఇళ్లల్లో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

ఈ విషయాన్ని గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపు అమలు అవుతున్నప్పటికీ బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని సీఎం కొంత మంది మంత్రులతో చర్చించి తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూను విధించడం జరిగింది.ఈ కర్ప్యూ ని ఇంకా కొద్ది రోజులు ముందుకు కొనసాగిస్తే మంచిదన్నాట్లుగా సీఎం జగన్ భావిస్తున్నాడట.అందుకోసం వాటికి సంబంధించి ఉత్తరాలను కూడా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.