`మా` ఎన్నిక‌ల్లో కొత్త మ‌లుపు..వైర‌ల్‌గా మారిన‌ న‌రేష్ మెసేజ్‌..?!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌ల వ్య‌వహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి అధ్యక్ష బరికి ఆరుగురు పోటీ పడుతుండటంతో తెలుగు ఇండ‌స్ట్రీ హీటెక్కిపోతోంది. మ‌రోవైపు ఎలక్షన్స్‌ తేదీని ఖారారు చేస్తూ ‘మా’ క్రమ శిక్షణ కమిటీ ప్రకటన కూడా విడుదల చేసింది.

Movie Artist Association complain to police on morphing websites

అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించ‌క‌ముందు వ‌ర‌కు మాటలకు పరిమితమైన `మా` రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ విందు రాజకీయాలకు తెరతీశారు. తాజాగా ఆయ‌న పేరిట ఓ పార్టీ ఆహ్వాన మెసేజ్ పెట్టింట వైర‌ల్‌గా మారింది.

Maa Party

హైదరాబాద్‌లోని దశ్‌పల్లా ఫోరమ్‌ హాల్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేస్తున్న పార్టీకి తప్పకుండా రావాలంటూ ఓ మెసేజ్‌ గురువారం పలువురు నటీనటుల వాట్సాప్‌ గ్రూప్‌లలో సర్కులేట్‌ అవుతోంది. ఈ మెసేజ్‌ డాక్టర్‌ నరేష్‌ విజయ్‌కృష్ణ పేరుతో వైరల్‌ అవుతోంది. అయితే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులకు తప్ప మిగతా సభ్యులకు ఫార్వర్డ్‌ చేస్తుండడం గమనార్హం. ప్ర‌స్తుతం ఈ మెసేజ్‌నే వైర‌ల్‌గా మారింది.