ప‌వ‌న్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్ట‌బొమ్మ‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది.

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar for new film - Movies News

ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ విష‌యంపై మేక‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రచారానికి బుట్టబొమ్మ ఒక్క ట్వీట్‌తో మరింత ఆజ్యం పోసింది. నిన్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పూజా హెగ్డే ఆయనకు విషెస్‌ తెలుపుతూ ట్వీట్ చేసింది.

marathi cineshine on Instagram: “- #poojahegde - #regrann” | Indian actress  pics, Indian actress hot pics, Bollywood actress hot photos

అయితే ఈ ట్వీట్ ఎవరు ఊహించనిది కావడం, పవన్-హరీష్‌ సినిమా ప్రీ లుక్ వచ్చిన కొద్దిసేపటికే పూజా పవన్‌కి విషెష్ తెల‌డంతో.. హరీష్ శంక‌ర్ మూవీలో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ‌నే న‌టించ‌నుందంటూ ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.