ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!

ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడిని మెయిన్ స్ర్టీమ్ రాజకీయాల్లోకి దించి తాను సైడ్ అయి పోవాలని భావిస్తున్నారట.

అసెంబ్లీ ఎన్నికల నాటికి వైసీపీ తరపున అభ్యర్థిగా రామ్మోహన్ నే బరిలోకి దింపాలని తండ్రి ప్లాన్ వేశారని తెలిసింది. కుమారుడి తరపున ప్రచారం నిర్వహించి అసెంబ్లీకి పంపి.. తాను క్రిష్ణా..రామా అనుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళంలో ధర్మాన రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశారని, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారని స్వయంగా తండ్రే చెబుతున్నారు. అవకాశముంటే శ్రీకాకుళం నగరానికి మేయర్ ను చేసేందుకు కూడా స్కెచ్ రూపొందించారు. అయితే ఇవన్నీ. . ధర్మాన ఆలోచనలు మాత్రమే.. రాజకీయాల్లో అనుకున్నవన్నీ సాధ్యం కావనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఇలాంటివి అస్సలు కుదరదు. జగన్ ఎంత చెబితే అంత.. ఆయనను ఒప్పిస్తే.. ఒకవేళ జగన్ ఒప్పుకుంటే.. రామ్మోహన్ పొలిటికల్ లైఫ్ ఆశించినంత ఉంటుంది.. లేకపోతే….!