ఢిల్లీ విమానాశ్రయంపై జ‌క్క‌న్న తీవ్ర అసహనం..!

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ తనయుడు, ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ రాజమౌళి తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌న ప‌ని తాను చూసుకునే జ‌క్క‌న్న‌.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని పరిస్థితిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

లుఫ్తాన్సా ప్లయిట్‌ ద్వారా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. ప్యాసింజలంద‌రూ దరఖాస్తులను గోడకు ఆనుకుని, మరికొందరు కింద కూర్చుని వాటిని పూర్తి చేస్తున్నారు. ఇదేమీ నాకు బాగా అనిపించలేదు. దరఖాస్తులను పూరించేందుకు టేబుల్స్ ఏర్పాటు చేస్తే బాగుండేది.

ఇక ఇక్కడ నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమిటంటే..ఎగ్జిట్ గేటు వ‌ద్ద‌కు రాగానే ఆకలిగా ఉన్న వీధి కుక్కలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. విదేశాల నుండి వచ్చిన విదేశీయులకు ఇలాంటి దృశ్యాలతో స్వాగతం పలకడం దేశ గౌరవానికి అంత మంచిది కాదు. ఈ విషయాన్ని అధికారులు దయచేసి పరిశీలించాలి. కృతజ్ఞతలు అంటూ జ‌క్క‌న్న ట్వీట్ చేశాడు. దాంతో ఆయ‌న ట్వీట్ వైర‌ల్ మార‌గా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.