రామ్ చరణ్ దంపతులకు పిల్లలు పూటకపోవడనికి కారణం అదేనా…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ఇండస్ర్టీలో తెలియని వారుండరు. మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా… ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. 2012లో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు పుట్టలేదు. ఎవరి కెరీర్ పరంగా వారు బిజీగా ఉంటారు. అపోలో హాస్పిటల్స్ ను మెయింటెన్ చేస్తూ… ఉపాసన, తన అప్ కమింగ్ మూవీల్లో నటిస్తూ… చరణ్ తీరిక లేకుండా ఉంటారు. వీరికి ఇంకా పిల్లలు పుట్టడం లేదని పలు యూట్యూబ్ చానళ్లు ఇష్టం వచ్చినట్లు రాశాయి. కానీ అవేమి పట్టించుకోకుండా ఉపాసన చాలా లైట్ తీసుకుంటారు.

ఉపాసనకు ఆధ్యాత్మికత ఎక్కువ. దానికి తోడు యోగా వంటి విషయాలపై కూడా మక్కువ ఎక్కువ. దీంతో వీటికి సంబందించి పలు యూట్యూబ్ చానళ్లను కూడా రన్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన పిల్లల గురించి మాట్లాడుతూ… ఇది 20 సంవత్సరాల ప్రేమ ప్రాజెక్ట్ అని మన జీవితంలో పిల్లలు చాలా ముఖ్యం అని అన్నారు. అంతేకాకుండా మాకు పుట్టబోయే పిల్లలను అర్ధహృదయంతో పెంచడం ఇష్టం లేదని తెలిపింది.