`మా` ఎన్నిక‌లు..బాల‌య్య సూటి ప్ర‌శ్న‌లు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష ప‌దివిని ద‌క్కించుకునేందుకు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ‌, మ‌రియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్‌ నరసింహారావు పోటా పోటీ ప‌డుతున్నారు.

MAA Elections 2021: 'మా' అధ్యక్షుడి బరిలో ఐదుగురు సభ్యులు.. ఎవరి బలమెంత..  బలగమెంత..?

సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నిక‌ల‌కు.. ఇప్ప‌టి నుంచే ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశారు అభ్య‌ర్థులు. అయితే మ‌రోవైపు సినీ పెద్ద‌లు మాత్రం ఎన్నిక‌లు లేకుండా ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారు. ఇలా త‌రుణంలో నంద‌మూరి బాల‌కృష్ణ.. `మా` ఎన్నిక‌లపై స్పందించారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని..అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనని బాల‌య్య స్ప‌ష్టం చేశారు.

ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ చేయడానికి కారణం చెప్పిన నాగబాబు: అవన్నీ బయటకొస్తే  గొడవలు జరుగుతాయంటూ! | Nagababu Comments on Prakash Raj Character - Telugu  Filmibeat

అలాగే `మా` అసోసియేషన్ లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారు.. మ‌రి ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య సూటిగా ప్రశ్నించారు. ఇక‌ `మా` అసోసియేషన్ కు ఇంత వరకు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించ‌లేద‌ని? తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా ఎందుకు సంపాదించ‌లేద‌ని? ప్రశ్న‌లు సంధించారు బాల‌య్య‌. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.