ప్రపంచంలోనే అత్యంత పురాతన హిందూ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా..?

ఆ గుడికి 600 ఏళ్ల చరిత్ర. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయమది. ఆ ఆలయాన్ని చూసినట్లయితే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు నిదర్శనాలుగా నిలుస్తోంది. భారత సంస్కృతికి చెందిన ఈ ఆలయం ఇండియాకు వేల కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఏంటి.. ఎక్కడుంది.. దాని విశిష్టతేమిటని తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఆ దేవాలయం గురించి తెలుసుకుందాం రండి.

కంబోడియా దేశంలోని ఆంగ్‌కోర్ వాట్‌లో శ్రీ మహా విష్ణు దేవాలయం ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, అత్యంత విశాలమైన హిందూ దేవాలయం. భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారసత్వంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడుగునా పర్యాటకులు, సందర్శకులు వస్తుంటారు. అలాంటి ప్రత్యేకమైన ఆలయానికి కంబోడియా జాతీయ పతాకంలో పెట్టుకుని గౌరవిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం యూనెస్కో వారసత్వ సంపదగా కొనసాగుతోంది.

ఆలయ ప్రత్యేకతలు..
విష్ణు ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి ప్రతి అణువులో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కనిపిస్తుంది. రామాయణం, మహాభారతం, సముద్ర మథనం, బలి చక్రవర్తి, స్వర్గ నరకాలు, దేవదానవుల మధ్య జరిగిన యుద్ధపు ఘట్టాలు కళ్లకు కట్టినట్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. రామనామం నుంచి శివ పంచాక్షరి మంత్రాలు ఆలయం చుట్టూ మారుమ్రోగుతాయి. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకతేమిటంటే ప్రకృతిని శివుడు ఆలింగనం చేసుకున్నట్లు కనిపించే దృశ్యం. ఇలాంటి ఎన్నో అద్భుత దృశ్యాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

ఆలయ చరిత్ర..
1112 సంవత్సరంలో రెండో సూర్య (బర్మన్ రాజు కాలం) ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది మేకాంగ్ నది తీరం వద్ద ఉంది. ఈ ఆలయాన్ని దూరం నుంచి చూసినవాళ్లకు ఒక జైలులా కనిపిస్తుంది. దీనికి నాలుగు దిక్కులా 400 అడుగుల వెడల్పు గొయ్యి ఉంటుంది. ఈ గొయ్యిలో ఎల్లప్పుడూ నీళ్లు ఉంటాయి. ఆలయానికి చేరుకోవడానికి బ్రిడ్జి మార్గం ఉంది. దీంతో గుడికి సులభంగా చేరుకోవచ్చు. 14వ శతాబ్దంలో కంబున్ రాజ్యం ఆక్రమణలు గురైంది. 19వ శతాబ్దం చివరి నాటికి దాదాపు 600 ఏళ్ల పాటు ఈ ఆలయం కనుమరుగైంది. ఓ పురావస్తు శాస్త్రవేత్త ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. హిందువులతోపాటు బౌద్ధ బిక్షువులను ఈ ఆలయం ఆకర్షిస్తోంది. అందుకే కంబోడియా దేశం కూడా తన జాతీయ జెండాపై ఆలయ చిహ్నాన్ని ఉంచి గౌరవించింది.