కరోనా భారీన పడ్డ యువ వికెట్‌ కీపర్‌..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల అనేక నష్టాలు వాటిల్లాయి. తాజాగా ఐపీఎల్ కూడా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా ఇండియా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ పంత్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన 23 మంది సభ్యులలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిసింది.

వారిలో ఎవరికి కరోనా వచ్చిందనే విషయం ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఆ కరోనా సోకిన ఆటగాడిని ఓ ఇంట్లో ఐసోలేషన్ లో ఉంచినట్లు సమాచారం. పంత్‌కు కరోనా సోకినట్లు తేలితే మాత్రం అది అతని తప్పే అని చెప్పొచ్చు. ఎందుకంటే యూరోకప్‌ 2020 లీగ్‌ మ్యాచ్‌లను చూడడానికి పంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. ఆ మ్యాచ్ ఫోటోలను కూడా పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దానివల్లే పంత్‌కు అక్కడే కరోనా వచ్చుండచ్చొని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.