శాకుంత‌లం సినిమాలో డెబ్యూ ఇవ్వనున్న అల్లు అర్హ..?

ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోగా మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు మంచి ఆద‌ర‌ణ పొందాడు. ఇది ఇలా ఉండగా ఇండ‌స్ట్రీకి వార‌సుల హ‌వా మాత్రం తగ్గడం లేదు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోకి చాలా మంది బాల న‌టులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవ్వబోతున్నట్లు సమాచారం. గుణ‌శేఖ‌ర్ రూపొందిస్తున్న శాకుంత‌లం సినిమాలో అర్హ వెండితెర డెబ్యూ ఇవ్వ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇందులో ప్రిన్స్ భార‌త అనే పాత్ర‌లో అర్హ అలరించబోతుంది.

ఇక సోష‌ల్ మీడియాలో అర్హ త‌న క్యూట్‌నెస్‌తో నెటిజ‌న్స్ని ఎంత‌గానో అక్కట్టుకుంటుంది. ఇప్పటికే అల వైకుంఠ‌పురములోని సినిమాలో “ఓ మై డాడీ” అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌లో క‌నిపించి అందరిని అల‌రించింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో అంచనాకు మించిన వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం అర్హ శాకుంత‌లం సినిమా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియడంతో నెటిజన్స్ దృష్టి ఈ సినిమాపై పడింది.