`విక్రమార్కుడు` సినిమాను వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం విక్ర‌మాక్కుడు. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ అందించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబుగానూ ర‌వితేజ ఇర‌గ‌దీశాడు.

అంతేకాదు, ర‌వితేజ స్టార్ హీరోగా ఎద‌గ‌డానికి విక్ర‌మార్కుడు మెయిన్ పిల్ల‌ర్‌గా మారింది. మ‌రోవైపు ఇదే సినిమాతో అనుష్క శెట్టి కూడా సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చింది. అలాగే తెలుగులో వచ్చిన తర్వాత మొత్తం ఐదు భాషల్లో రీమేక్ అయిందీ చిత్రం. అయితే మొద‌ట ఈ సినిమా కథను రవితేజ కోసం అనుకోలేద‌ట‌. ఇంత పవర్ ఫుల్ కథ ఒక స్టార్ హీరో చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టొచ్చు అనే ఉద్దేశంతో.. పవన్ క‌ల్యాణ్ కు ఈ కథ చెప్పాలని చూశార‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే బంగారం సినిమా షూటింగ్ సమయంలో సెట్ కి వెళ్లి పవన్ కు ఈ కథ చెప్పాడు రాజ‌మౌళి. కథ విన్న తర్వాత ప‌వ‌న్‌.. బాగానే ఉంది కానీ తర్వాత చూద్దాం, కాస్త గ్యాప్ తీసుకుంటున్నాన‌ని చెప్పాడ‌ట. ఇక ఆ త‌ర్వాత ప‌వ‌న్ నుంచి ఎలాంటి స్పంద‌న రావ‌డంతో.. ర‌వితేజ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించి భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు జ‌క్క‌న్న‌.