ర‌జినీ సెన్సేషనల్ రికార్డ్‌పై క‌న్నేసిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయ‌డంతో పాటు టీజ‌ర్ కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ వండర్స్ సృస్టించింది. బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ టీజర్ అగ్ర హీరో రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్తున్నది. కేవ‌లం వారం రోజుల్లోనే 30 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు 35 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ ను టచ్ చేసింది.

అఖండ టీజ‌ర్ స్పూడ్ చూస్తుంటే.. సౌత్ స్టార్ ర‌జినీ పేరిట ఉన్న సెన్సేషనల్ రికార్డ్ ను బాల‌య్య బ్రేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు. వాస్త‌వానికి రజినీకాంత్ నటించిన కబాలీ టీజ‌ర్‌ 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబ‌ట్టి చరిత్ర సృష్టించింది. అయితే అఖండ ఆల్రెడీ మాస్ స్పీడ్ తో 35 మిలియన్ క్రాస్ చేసేసింది. దీని బ‌ట్టీ చూస్తే మ‌రో రెండు మూడు రోజుల్లోనే క‌బాలీ సృష్టించిన చ‌రిత్ర‌ను అఖండ తిర‌గ‌డం రాయ‌డం ఫిక్స్ అని అంటున్నారు.