c/o సూర్య TJ రివ్యూ

టైటిల్‌: c/o సూర్య

న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్‌, విక్రాంత్‌, మెహ్రీన్ ప్రిజాద‌

మ్యూజిక్‌: డి.ఇమాన్‌

ఎడిటింగ్‌: ల‌క్ష్మ‌ణ్ కుమార్‌

నిర్మాత‌: చ‌క్రి చిగురుపాటి

ద‌ర్శ‌క‌త్వం: సుశీంద్ర‌న్‌

రిలీజ్ డేట్‌: 10 నవంబ‌ర్‌, 2017

యంగ్‌హీరో సందీప్ కిష‌న్ న‌టించిన ద్విభాషా చిత్రం c/o సూర్య . కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సందీప్ స‌ర‌స‌న గోల్డెన్‌గ‌ర్ల్‌, వ‌రుస హిట్ల‌తో మాంచి ఫామ్‌లో ఉన్న మెహ్రిన్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రి ఈ సూర్య హిట్ లేక క‌ష్టాల్లో ఉన్న సందీప్‌కు హిట్ ఇచ్చిందో ? లేదో ? చూద్దాం.

స్టోరీ :

సూర్య (సందీప్‌కిషన్‌) స్నేహానికి ప్రాణం ఇచ్చే కుర్రాడు. ఏంబీఏ ఫెయిల్ అయ్యి క్యాట‌రింగ్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. సూర్య సిస్ట‌ర్ ఎండీ స్ట‌డీ చేస్తుంటుంది. సూర్యకు మ‌హేష్ (విక్రాంత్‌) బెస్ట్ ఫ్రెండ్‌. సూర్య చెల్లి మ‌హేష్ ప్రేమించుకుంటారు. ఈ టైంలో ఓ షాకింగ్ విష‌యం సూర్య‌కు తెలుస్తుంది. వెంట‌నే సూర్యే స్వ‌యంగా పోలీసుల చేత మ‌హేష్‌ను అరెస్టు చేయిస్తాడు. మ‌హేష్ జైలు నుంచి వ‌చ్చాక కూడా అత‌డిపై మ‌ర్ట‌ర్ ఎటెంప్ట్ జ‌రుగుతుంది. మ‌రి ఈ ప‌నుల‌న్ని సూర్య‌నే చేయిస్తున్నాడా ? లేదా మ‌హేష్‌కు ఎవ‌రితో అయినా లింకులు ఉన్నాయా ? మ‌హేష్ – సూర్య చెల్లి ఒక్క‌ట‌య్యారా ? వీరి జీవితానికి కిరాయి హంతకుడు(హరీశ్‌ ఉత్తమన్‌) కి ఉన్న లింకులు ఏంట‌నేది ? తెర‌మీద చూసి తెలుసుకోవాలి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & విశ్లేష‌ణ‌:

సందీప్‌కిష‌న్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా బాగా మెప్పించాడు. భావోద్వేగాల సీన్ల‌లోను, స్నేహానికి ప్రాణం ఇచ్చే సీన్లు, క్లైమాక్స్‌లో త‌న చెల్లిని కాపాడుకునే సీన్ల‌లో బాగా న‌టించాడు. సందీప్ క్యారెక్ట‌ర్ చుట్టూ ద‌ర్శ‌కుడు సీన్లు అల్లుకోవ‌డంతో ఇత‌డి క్యారెక్ట‌రేజేష‌న్ ఎలివేట్ అయ్యింది. హీరోయిన్ మెహ్రీన్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. కాసేపు అందంతో మెప్పించ‌డం త‌ప్పా ఈ సినిమాకు ఆమె వ‌ల్ల ఒరింగిదేమీ లేదు. హరీశ్‌ ఉత్తమన్‌ ప్రతినాయకుడిగా కళ్లతోనే భావాలు పలికించాడు.

క‌థ‌నం విష‌యానికి వ‌స్తే ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడి చుట్టూ తిరిగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఫ‌స్టాఫ్‌లో ఫ్రెండ్‌షిఫ్‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో స‌ర‌దా స‌న్నివేశాల‌తో ద‌ర్శ‌కుడు బండి న‌డిపించాడు. తాను ఎంతో ఇష్ట‌ప‌డే బెస్ట్‌ఫ్రెండ్ మ‌హేష్‌నే సూర్య అరెస్టు చేయించ‌డంతో క‌థ ఒక్క‌సారిగా మ‌లుపులు తిరుగుతుంది. ఇక మ‌హేష్‌ను ఎవ‌రు చంపాల‌నుకుంటున్నారో ఇన్వెస్ట్ చేసే క్ర‌మం కూడా ఆస‌క్తిగా ఉంటుంది. ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిన సినిమా సెకండాఫ్‌లో ఒక్క‌సారిగా మిస్ట‌రీ, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా మార‌డంతో ఆస‌క్తి పెరుగుతుంది. ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఇక క‌థ‌ను ప్రారంభించిన విష‌యాల‌తోనే ఎండ్ చేయ‌డం బాగుంది. క‌థలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో పాత సీన్లు చూసిన ఫీలింగ్‌, సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాలో కామెడీకి స్కోప్ ఉన్నా ద‌ర్శ‌కుడు ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేదు. సుశీంద్ర‌న్ గ‌తంలో తీసిన నా పేరు శివ తరహా థ్రిల్‌గానీ, అలాంటి ఆసక్తికరమైన కథను ఆశిస్తే ప్రేక్షకుడు భంగపడక తప్పదు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ ఎక్క‌డా రొమాంటిక్ ఫీల్‌ను ఇవ్వ‌లేదు. హీరోయిన్ మెహ్రీన్ ప్రిజాద కేవలం మూడు నాలుగు సన్నివేశాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. మధ్యలో వచ్చే రెండు పాటలు కూడా మెప్పించలేకపోయాయి.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…

ల‌క్ష్మ‌ణ్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ నేచురాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. ఇమాన్ సంగీతంలో పాట‌లు బ్యాడ్ ఆర్ఆర్ గుడ్‌. డైలాగ్స్‌చాలా వీక్‌. చ‌క్రి చిగురుపాటి నిర్మాణ విల‌వ‌లు సినిమా కోసం రాజీప‌డకుండా ఖ‌ర్చుపెట్టిన‌ట్టు ఉన్నాయి. ఇక ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ విష‌యానికి వ‌స్తే ఫ్రెండ్‌షిఫ్ నేప‌థ్యంలో ఎంచుకున్న స్టోరీ మంచిదే అయినా దానిని పూర్తిగా డ‌వ‌ల‌ప్ చేయ‌డంలో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసే క‌థ‌నం రాసుకోవ‌డంలో పూర్తిగా స‌క్సెస్ కాలేదు. నాలుగైదు స‌న్నివేశాలు త‌ప్పా క‌థ‌నం అంచ‌నాలు అందుకోదు.

TJ ఫైన‌ల్ పంచ్‌: c/o యావ‌రేజ్ థ్రిల్ల‌ర్‌

TJ ఫైన‌ల్ సూచ‌న‌: ఈ వీకెండ్ మ‌రీ ఖాళీగా ఉంటే ఓ సారి చూడొచ్చు

TJ c/o సూర్య రేటింగ్‌: 2.5 / 5