వైసీపీకి మ‌రో షాక్ కీల‌క వికెట్ డౌన్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో ఆ పార్టీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గంనుంచి ఆయ‌న బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు.

గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు పావులు కదిపింది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో మంతనాలు జరిపి పార్టీలో గుత్తుల సాయికి సముచిత స్థానం కల్పించి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ నెల 14న ఆయ‌న టీడీపీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది.

కోన‌సీమ‌లో బ‌లంగా ఉన్న శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గంలో ఈయ‌న కీల‌క నేతా ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీకి కీల‌క అనుచ‌రుడు అయిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో టిక్కెట్ రాక‌పోవ‌డంతో స్వ‌తంత్య్రంగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న జ‌గ‌న్ కొద్ది రోజుల క్రితం అదే నియోజ‌క‌వ‌ర్గానికి పితాని బాల‌కృష్ణ‌ను మ‌రో కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మించారు. దీంతో గుత్తుల సాయి, పితాని వర్గీయుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

జ‌గ‌న్ బాల‌కృష్ణ‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన సాయి పార్టీ మారేందుకు డెసిస‌న్ తీసుకున్నారు. సాయి పార్టీ మార‌డం వైసీపీకి కోన‌సీమ‌లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గంలో పెద్ద మైన‌స్‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల‌నాటికి శెట్టిబ‌లిజ‌ సామాజికవర్గాన్ని పూర్తిగా టీడీపీవైపు మలుచుకునే వ్యూహంలో భాగంగా టీడీపీ ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రికొంత మంది నాయ‌కుల‌ను కూడా త‌న వైపున‌కు తిప్పుకోనుంది.