ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు […]

ఇప్పుడు చంద్ర‌బాబు టార్గెట్ వాళ్లేనా

అసంతృప్తి.. టీడీపీలో ఈమ‌ధ్య విప‌రీతంగా వినిపిస్తున్న ప‌దం!! క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌యిన టీడీపీలో అసంతృప్తి వ‌ల్ల తీవ్ర అల‌జ‌డి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజ‌కీయంగా బ‌లోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్‌` వ‌ల్ల ఇది మ‌రింత తీవ్ర‌మైంది. రెండేళ్లలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇదే అసంతృప్తి కొన‌సాగితే.. జంపింగ్‌లు ఎక్కువ‌వుతాయ‌ని దీనివ‌ల్ల‌ పార్టీకి తీవ్ర న‌ష్ట త‌ప్ప‌ద‌ని భావించిన అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో వెంట‌నే ఆయ‌న అల‌ర్ట్ అయ్యారు. ఇలా వ‌దిలేస్తే ఇంకా […]

బాలయ్యకు “రెడ్డిగారు” కాదు

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత సీ.క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాల‌య్య రాయ‌ల‌సీమ‌లోని ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా నటిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాకు ముందుగా రెడ్డిగారు అనే టైటిల్ పెడ‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

ఎన్టీఆర్ సినిమాకు కొర‌టాల రెమ్యునరేష‌న్ @ రూ. 25 కోట్లు

ఏ హీరో – ద‌ర్శ‌కుడి కాంబోలో ఓ హిట్ సినిమా ప‌డితే వాళ్ల కాంబోలో మరో సినిమా వ‌స్తుందంటే అంచ‌నాలు ఎక్క‌డ ఉంటాయో ? వాళ్ల రేట్లు ఎలా పెరిగిపోతాయో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాకు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం […]

గంటాను వ‌దిలించుకుంటోన్న బాబు

ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయ‌నకు ఒకే పార్టీలో ఉండి రాజ‌కీయాలు చేయాల‌న్న సూత్రం ఏదీ ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌కు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న టీంతో క‌లిసి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గంటాకు జిల్లాలో […]

టీడీపీలో బ్ర‌ద‌ర్స్ బ‌ల ప్ర‌దర్శ‌న వెన‌క మ‌ర్మ‌మేంటో..?

క‌ర్నూలులో త‌మ హ‌వా మ‌ళ్లీ కొన‌సాగించేందుకు కేఈ సోద‌రులు త‌హ‌త‌హలాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా పూర్వ వైభవం సంపాదించాల‌ని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దప‌డం ప్రారంభించారు. త‌మ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని అధినేత చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ల‌డానికి స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని వేదిక‌గా మ‌లుచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ కుటుంబం ఎప్పుడూ టీడీపీకి విధేయ‌త‌ను ప్ర‌క‌టించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించి చంద్ర‌బాబుకు కానుక‌గా ఇస్తామ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు దీని వెను […]

టీఆర్ఎస్ మంత్రిలో అస‌మ్మ‌తి మొద‌లైందా?

ఎవ‌రిని ఎలా ఉప‌యోగించుకోవాలో.. ఎవ‌రిని ఎప్పుడు ఎలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు! ఉప‌యోగించుకున్నంత సేపు వారిని త‌ల‌మీద పెట్టుకుంటారు! త‌ర్వాత వారి వైపు కన్నెత్తి చూడ‌రు! అస‌లు ప‌ట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా ప‌క్క‌న‌పెట్టేశారు. కీల‌క మంత్రిత్వ‌ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా.. ఆయ‌న శాఖ‌లోని వ్య‌వ‌హారాల‌న్నీ కేసీఆర్ స్వ‌యంగా ప‌రిశీలిస్తుండ‌టంతో మంత్రి ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూమ్ […]

ఎమ్మెల్యే బ‌రిలో సీఎం.ర‌మేశ్‌….ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారా ? ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదా ? ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ర‌మేశ్ ఇప్ప‌టికే ఓ సేఫ్ నియోజ‌క‌వ‌ర్గం కూడా చూసేసుకున్నారా ? అంటే క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ఉన్న సీఎం.ర‌మేశ్‌కు ఇటీవ‌ల ఆయ‌న వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. ఆయ‌న రాజ్య‌స‌భ […]

ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీకి వాళ్ల బ్రేకులు..!

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తారా ? లేదా ఏదైనా పార్టీ ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా ? అన్న మీమాంస ఉండ‌గానే ఆయ‌న కొత్త పార్టీయే పెడ‌తారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ర‌జ‌నీ ప‌దే ప‌దే అభిమాన సంఘాల‌తో మీట్ కావ‌డం, వారు ర‌జ‌నీపై కొత్త పార్టీ పెట్టాల‌ని ప్రెజ‌ర్ చేయ‌డంతో ర‌జ‌నీ కొత్త పార్టీయే పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. […]