టీఆర్ఎస్ మంత్రిలో అస‌మ్మ‌తి మొద‌లైందా?

ఎవ‌రిని ఎలా ఉప‌యోగించుకోవాలో.. ఎవ‌రిని ఎప్పుడు ఎలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు! ఉప‌యోగించుకున్నంత సేపు వారిని త‌ల‌మీద పెట్టుకుంటారు! త‌ర్వాత వారి వైపు కన్నెత్తి చూడ‌రు! అస‌లు ప‌ట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా ప‌క్క‌న‌పెట్టేశారు. కీల‌క మంత్రిత్వ‌ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా.. ఆయ‌న శాఖ‌లోని వ్య‌వ‌హారాల‌న్నీ కేసీఆర్ స్వ‌యంగా ప‌రిశీలిస్తుండ‌టంతో మంత్రి ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా ఆయ‌న్ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

డ‌బుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లోనే జ‌రుగుతున్నాయి.. ఇది ప్ర‌తిప‌క్ష నేత‌లు చేసిన ప్ర‌క‌ట‌న కాదు!! స్వ‌యంగా టీఆర్ఎస్ మంత్రి ఈట‌ల రాజేందర్ చేసిన వ్యాఖ్య‌లు. ఇప్పుడు ఇవి తీవ్ర క‌ల‌కలం రేపుతున్నాయి. ఆయ‌న‌లో చాలా కాలంగా అసంతృప్తి ఉంద‌ని, దీని ఫ‌లిత‌మే ఈ వ్యాఖ్య‌లు అని పార్టీలో కొన్ని వ‌ర్గాలు చ‌ర్చించుకుం టు న్నాయి. ఈటలకు పార్టీలో ప్రాధాన్యత లేక ఇబ్బంది పడుతున్నారా? ఈటలను అధిష్టానం పట్టించుకోడం లేదా? మంత్రి ఈటల రాజేందర్ అంతర్మధనం లో పడ్డారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ లో ఆయన ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నార‌నే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్ణయాల్లో ఈటల ప్రమేయం నామమాత్రంగా కనిపిస్తోంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు కనీసం చెప్పకుండా అధికారులు చేసుకుపోతున్నారు. వీరందరికీ వెనకాల సీఎం కేసిఆర్ మద్దతు ఉందన్నది అంత‌ర్గ‌తంటా టాక్‌. ఈటల రాజేందర్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారన్నది ఆయన సన్నిహితుల మాట. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను మంత్రి అంతర్గత చర్చల్లో తప్పు పడుతుంటారని సమాచారం. టీజేఏసి చైర్మన్ కోదండరాం పై ఆ మధ్య టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి చేయటాన్ని ఈటల తప్పుపట్టారని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.

రాజేందర్ కు ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖ కూడా ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో భారి మార్పులు చేసారు సీఎం కేసీఆర్. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండి గా ఐఏఎస్ ను కాదని ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ ను నియమించారు. ఆయ‌న‌ వచ్చాక పౌర సరఫరాల శాఖ లో ఎం జరుగుతుందో ఈటలకు తెలియకుండా పోయిందద‌ని, ప్రతి చిన్న విషయాన్ని ఆనంద్ నేరుగా సీఎం కార్యాలయానికి నివేదిస్తు న్నట్టు సమాచారం. వీటి నుంచి తేరుకోక ముందే సివిల్ సప్లైయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పెద్ది సుదర్శన్ ను సీఎం కేసీఆర్ నియమించారు. ఇలా వ్యూహాత్మ‌కంగానే ఈట‌ల‌ను సీఎం ప‌క్క‌న‌పెట్టార‌నే టాక్ న‌డుస్తోంది!!