ఎన్టీఆర్ సినిమాకు కొర‌టాల రెమ్యునరేష‌న్ @ రూ. 25 కోట్లు

ఏ హీరో – ద‌ర్శ‌కుడి కాంబోలో ఓ హిట్ సినిమా ప‌డితే వాళ్ల కాంబోలో మరో సినిమా వ‌స్తుందంటే అంచ‌నాలు ఎక్క‌డ ఉంటాయో ? వాళ్ల రేట్లు ఎలా పెరిగిపోతాయో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాకు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబుతో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తోన్న కొర‌టాల ఆ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం స్క్రిఫ్ట్ రెడీ చేసే ప‌నిలో బిజీ కానున్నాడు. ఈ సినిమాను కొర‌టాల‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కోసం కొర‌టాల రెమ్యున‌రేష‌న్స్ తీసుకోవ‌డం లేద‌ట‌. సీడెడ్‌ మరియు వైజాగ్‌ ఏరియాల రైట్స్ తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్‌లో కూడా 50 శాతం కొర‌టాల‌కే ద‌క్కేలా ఒప్పందం కుదిరింద‌ట‌. ఇక ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ‌కు జ‌రుగుతోన్న ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 120 కోట్లు జ‌రుగుతోంది.

ఈ లెక్క‌న చూస్తే సీడెడ్‌, వైజాగ్ రైట్స్‌, శాటిలైట్ రైట్స్‌లో స‌గం మొత్తం క‌లుపుకుంటే ఎన్టీఆర్ సినిమాకు కొర‌టాల‌కు రూ. 25 కోట్ల వ‌ర‌కు ద‌క్కనుంది. ఇక జై ల‌వ‌కుశ‌, త్రివిక్ర‌మ్ సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అయితే ఎన్టీఆర్ మార్కెట్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం. అప్పుడు కొరటాల‌కు రూ. 30 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ముట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.