వైసీపీకి సీనియ‌ర్ నేత‌లు కావ‌లెను?!

ఇప్పుడు ఎక్కువ మంది  ఇలానే ఆలోచిస్తున్నార‌ట‌! రాబోయే రెండేళ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు పెట్టుకుని  ఇప్పుడు వైసీపీ త‌డ‌బ‌డుతోంద‌ని, అధికార టీడీపీని ఎదుర్కొనే స‌త్తా కూడా ఈ పార్టీలో క‌రువ‌వుతోంద‌ని అంటున్నారు. ఈ న‌ప‌థ్యంలోనే సీనియ‌ర్ల కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నాడ‌ని అంటున్నారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవ‌ల కాలంలో పొలిటిక‌ల్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించ‌లేక‌పోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జ‌గ‌న్ చాంబ‌ర్‌లో వ‌ర్ష‌పునీళ్లు పార‌డంపై పెద్ద ఎత్తున ఉద్య‌మించాల్సిన నేత‌లు చ‌తికిల ప‌డ్డారు. 

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వైసీపీలో గొంతున్న నేత‌లు లేక‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి నేత‌లు అసెంబ్లీ విష‌యాన్ని పెద్ద ఎత్తున త‌మ ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఇక‌, రోజా, చెవిరెడ్డి వంటి వాళ్లు మాట్లాడుతున్నా.. ప్ర‌జ‌లు అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో టీడీపీ ముందు వైసీపీ అంత‌గా క్లిక్ కాలేద‌ని అనిపిస్తోంది. 

అదేస‌మ‌యంలో జ‌గ‌న్ కూడా సీనియ‌ర్ నేత‌ల‌ను ప్రోత్స‌హించ‌డం లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. గ‌తంలో మైసూరా, కొణ‌తాల వంటి నేత‌లు ఏదైనా ఈగ‌వాలితేనే చూస్తూ ఊరుకునే వారు కారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ నేత‌లు మౌనంగా ఉంటూ అధికార ప‌క్షానికి చేజేతులా అవ‌కాశం ఇస్తున్నార‌ని అంటున్నారు.  ఇక‌, కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చే వారిని కూడా జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ఏపీలో అధికార ప‌క్షానికి వైసీపీ కావాల‌నే అడ్డుప‌డుతోంద‌నే వాద‌న‌ను అధికార ప‌క్షం, దీనిని మిత్ర ప‌త్రిక‌లు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నాయి. మ‌రి ఈ ప‌రిణామాన్ని అడ్డుకుని వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేలా వాయిస్ వినిపించే నేత‌లు మాత్రం వైసీపీలో క‌రువ‌య్యారు. మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్‌.. అలాంటి క‌త్తుల్లాంటి నేత‌ల‌ను త‌యారు చేస్తారో లేదో చూడాలి. ఏదేమైనా.. ఇప్ప‌టికిప్పుడు మాత్ర వైసీపీకి ద‌మ్మున్న నేత‌ల కొర‌త బాగా క‌నిపిస్తోంది.