జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వారి స్థ‌లం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ్ర‌తికున్న రోజుల్లో ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ అండ్ ఆదిశేష‌గిరిరావులు ఆయ‌న వెంట న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయ‌కుండా ఉండి ఉంటే.. ఘ‌ట్ట‌మ‌నేని వారి మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే ఉండేది. అయినా కూడా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం జ‌గ‌న్ ప‌ట్ల విధేయ‌త‌గానే ఉంది. తాజాగా జ‌గ‌న్‌కి ఆదిశేష‌గిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నార‌ని వార్త వ‌చ్చింది.

రాష్ట్ర బైఫ‌ర్ కేష‌న్ జ‌రిగి మూడేళ్ల‌యినా.. జ‌గ‌న్ ఇంకా ఏపీలో పూర్తి స్థాయిలో అడుగు పెట్ట‌లేదు. చుట్ట‌పు చూపుగా మాత్ర‌మే వ‌చ్చి ఏదైనా స‌మ‌స్య‌పై మాట్లాడుతున్నారు. మొన్నామ‌ధ్య అమ‌రావ‌తిలో అసెంబ్లీ జ‌రిగిన‌ప్పుడు కూడా మూడు రోజులు ఇక్క‌డ‌, మూడు రోజులు హైద‌రాబాద్‌లో అన్న‌ట్టుగా ఆయ‌న గ‌డిపారు. ఇది చూడ‌డానికి బాగానే ఉన్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం.. జ‌గ‌న్‌ను ఇంకా ఓన్ చేసుకోలేద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత , సీఎం చంద్ర‌బాబు.. తెల్లారిలేస్తే.. ఏపీలోనే ద‌ర్శ‌న మిస్తున్నారు. విజ‌య‌వాడ వెళ్తే.. బాబు క‌లిసి రావొచ్చు అనే భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింది.

దీంతో వైసీపీ ప్ర‌జ‌లకు దూర‌మ‌వుతోంద‌నే వార్త జ‌గ‌న్‌కి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేద‌ని తెలిసింది. దీనికితోడు టీడీపీ నేత‌లు కూడా జ‌గ‌న్‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఏపీకి షిఫ్ట‌వ్వాల‌ని భావించాడు. కానీ, ఆయ‌న కు స‌రైన స్థ‌లం, ఇల్లు ల‌భించ‌లేదు. ఈ విష‌యం తెలిసిన ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు.. మంగ‌ళ‌గిరి తాలూకా తాడేప‌ల్లిలో త‌న‌కున్న రెండెక‌రాల‌ను జ‌గ‌న్‌కు ఇచ్చార‌ని స‌మాచారం. దీనిలో జ‌గ‌న్ పార్టీ కార్యాల‌యంతో పాటు త‌న నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటార‌ని స‌మాచారం. అయితే, వ‌చ్చే స‌మావేశాల వ‌ర‌కు మాత్రం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే బంగ్లాలోనే ఉంటార‌ని తెలిసింది. ఈ విష‌యంలో ఆయ‌న ప్ర‌భుత్వానికి లేఖ‌రాశార‌ని స‌మాచారం.