`బాహుబ‌లి-3`పై జ‌క్క‌న్న క్లూ ఇచ్చాడా?

బాహుబ‌లి రెండు భాగాల‌ను విజ‌యవంతంగా తెర‌కెక్కించి తెలుగు సినిమా స్థాయిని మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి! ఎవ‌రికీ అందనంత ఎత్తులో నిలుచున్నాడు జ‌క్క‌న్న‌! అయితే బిగినింగ్, కన్‌క్లూజ‌న్ అని రెండు పార్టులు చెప్పేసినా.. ఇంకా ప్రేక్ష‌కులకు స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు మిగిలే ఉన్నాయి. అవేంటంటే.. బాహుబ‌లి సిరీస్ ఇక్క‌డితో ఆగిపోతుందా? లేక కొన‌సాగుతుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఉంది. బాహుబ‌లి కంటిన్యూ ప్రాసెస్ అని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు రాజ‌మౌళి! సో అంతా ఇప్పుడు దీనిని గ‌ర్తుచేసుకుంటున్నారు. మూడో పార్టు ఉంటుందా లేదా అందులోనూ ప్ర‌భాస్ హీరోగా ఉంటాడా అని సందేహాలు వెల్లిబుచ్చుతున్నారు.

అనుకున్నట్టుగానే బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ రెండిటిని అంచనాలకు తగ్గట్టుగానే తీసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు రాజమౌళి. ఒక సినిమా అది కూడా 150 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా మొదలు పెట్టి నిడివి ఎక్కువవడం వల్ల రెండు పార్టులుగా విడుదల చేయాల్సి వచ్చిందట. బాహుబలి సినిమా ఐదేళ్లు పడుతుందంటే తాను తీసే వాడిని కాదని రాజమౌళి అన్నాడు కూడా. ఇక బాహుబలి పార్ట్ 1 లానే పార్ట్ 2 కూడా రాజమౌళి దర్శకత్వ ప్రతిభను చూపించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి ఈ కథ పూర్తవుతుంది కానీ సీక్వల్స్ మాత్రం వస్తాయని అప్పట్లో అన్నాడు జక్కన్న.

అంటే బాహుబలి 3, 4 అలా కూడా వచ్చే అవకాశాలున్నాయన్నమాట. బాహుబలి 2 ప్రమోషన్స్ టైంలో మాత్రం వాటి గురించి ప్రస్తావన తీసుకు రాలేదు జక్కన్న. అసలు బాహుబలి కొనసాగించే ఆలోచన ఉందా లేకపోతే ఇది వరకు ఎందుకు బాహుబలి మిగతా పార్టులు తీస్తానని చెబుతాడు? ఉంటే ఎప్పుడు అన్నది ప్రేక్షకుల ప్రశ్న. బాహుబలి తర్వాత సీక్వల్స్ తీస్తే హీరో ఎవరు మళ్లీ ప్రభాస్ తోనే తీస్తాడా లేక మరెవరినైనా సెలెక్ట్ చేస్తాడా ఇలా ఎన్నో సందేహాలు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. వీటన్నిటికి రాజమౌళి ఎప్పుడు ఎలా ఆన్సర్ ఇస్తాడో చూడాలి.

బాహుబలి సినిమాతో బాలీవుడ్ హీరోలు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా కోసం క్యూలు కడుతున్నారు మరి వారిని కాదని ఈసారి పెద్ద ప్రాజెక్ట్ కూడా తెలుగు హీరోతో చేస్తాడా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మ‌రి రాజ‌మౌళి త‌దుప‌రి ప్రాజెక్ట్ ఏంట‌నేది స‌స్పెన్స్‌గా మారింది.