కృష్ణా జిల్లా వైసీపీ అభ్య‌ర్థులు వీరే

రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజ‌య‌వాడ‌పై అటు టీడీపీ, ఇటు వైసీపీ పూర్తిగా దృష్టిసారించాయి. ఇక్క‌డ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈసారి ఎలాగైనా ఇక్క‌డ పాగా వేయాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ దృఢంగా నిశ్చ‌యించుకున్నారు. అంతేగాక ఇప్ప‌టి నుంచే ఇందుకు త‌గిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. రెండేళ్ల ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారుచేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టినుంచే వారికి నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు అప్ప‌గించి.. ఎలాగైనా విజ‌య‌వాడ‌లో క్లీన్ స్వీప్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారిన్ని చేజిక్కించుకోవాలంటే విజ‌య‌వాడ‌లో ప‌ట్టు సాధించం త‌ప్ప‌నిస‌రి. దీనిని గ్ర‌హించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌..కృష్ణా జిల్లాలోని 16 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల‌కు గాను ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థులను ఖ‌రారుచేసే ప‌నిలో ప‌డ్డారట‌. ప్ర‌స్తుతం స‌మాచారం ప్ర‌కారం.. పోటీచేసే అభ్య‌ర్థుల వివ‌రాలు ఇవి.. జ‌గ్గ‌య్య‌పేట నుంచి కాపు వ‌ర్గానికి చెందిన స‌మ్మినేని ఉద‌య‌భాను గానీ క‌మ్మ వ‌ర్గానికి చెందిన వ‌సంత కృష్ణ ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నందిగామలో టి. జ‌గన్మోహ‌న్‌రావు , బోయ‌పాటి బాబూ రావులో ఒక‌రిని ఖ‌రారు చేయ‌వ‌చ్చ‌ట‌. మైల‌వరం జోగి ర‌మేష్‌, కోమాటి భాస్క‌రావు స‌మీప బంధువుతో పాటు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ట‌.

ఇక విజ‌య‌వాడ వెస్ట్‌లో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌, ఎక్స్ మేయ‌ర్ మ‌ల్లికా బేగం బ‌రిలోకి దిగ‌వ‌చ్చ‌ట‌. విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ నుంచి వంగ‌వీటి రాధాకృష్ణ పేరు మాత్ర‌మే వినిపిస్తోంది. విజ‌య‌వాడ ఈస్ట్ బొప్ప‌న భ‌వ‌కుమార్, లేక మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి పేర్లు వినిపిస్తున్నాయి. పెన‌మ‌లూరు మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి పేరు వినిపిస్తున్నా ఆయ‌న‌ ఎంపీగా పోటీకి దిగితే క‌మ్మ వ‌ర్గానికి చెందిన తాతినేని ప‌ద్మావ‌తి పోటీచేయ‌వ‌చ్చ‌ట‌. పామ‌ర్రులో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ వై దాస్, గ‌న్న‌వ‌రంలో వైఎస్ సన్నిహితుడు రామ‌చంద్ర‌రావును దింపాల‌ని భావిస్తున్నా.. యాద‌వ వ‌ర్గానికి చెందిన‌ కొలుసు పార్థ‌సార‌ధిని గానీ పరిస్థితులు మారితే వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా పోటీచేయ‌వ‌చ్చు.

గుడివాడ- కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు నాని; అవ‌నిగ‌డ్డ‌లో రెండు సార్లు పోటీచేసి ఓడిపోయిన‌ సింహాద్రి ర‌మేష్‌

లేదా బ‌ల‌మైన క‌మ్మ నాయ‌కుడి కోసం ఎదురుచూస్తోంది. ఇక మ‌చిలీప‌ట్నం- మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ పేర్ని వెంక‌ట‌రామ‌య్య‌, పెడ‌న‌- వి,రాంప్ర‌సాద్‌బీసీ వ‌ర్గానికి చెందిన పద్మ‌శాలి వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి. కైక‌లూరు- డీ నాగేశ్వ‌ర‌రావు య‌ర్నేని కుటుంబానికి చెందిన ఒక నిర్మాత పేరు వినిపిస్తోంది.

నూజివీడు- మేకా వెంక‌ట ప్ర‌తాప్‌, ముద్ర‌బోన వెంక‌టేశ్వ‌ర‌రావు; తిరువూరు- గిరీశం ప‌ద్మజ్యోతి కానీ మ‌రొక‌రు బ‌రిలోకి దిగొచ్చ‌ట‌.

ఇక మ‌చిలీప‌ట్నం ఎంపీగా- సీనియ‌ర్ నాయ‌కుడు కొలుసు పార్థ‌సార‌థి గానీ సినీన‌టుడు అక్కినేని నాగార్జున ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. నాగార్జున పోటీచేయ‌ని ప‌క్షంలో ఆయ‌న మిత్రుడు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌ని లేదా మాజీ ఎంపీ బి.రామ‌కృష్ణ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇక విజ‌య‌వాడ నుంచి.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. అలాగే ప‌వ‌న్‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య స‌న్నిహిత్యం పెరిగితే ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌కు అత్యంత సన్నిహితుడైన‌ పీవీపీని బ‌రిలోకి దింప‌వ‌చ్చు.