బాహుబ‌లి-2 అమ్మ‌కాలు చూస్తే షాక‌వ్వాల్సిందే!

జ‌క్క‌న్న రాజ‌మౌళి సిల్వ‌ర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌నే వార్త.. అటు బ‌య్య‌ర్ల‌లోనూ, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ భ‌రోసా క‌ల్పిస్తోంది. దీంతో ఖ‌ర్చుకు వెనుకాడ‌టం లేదు. ఆంధ్ర‌, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబ‌లి-2 సినిమాను ఫ్యాన్సీరేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు ముందు ఓ బయ్యర్‌ బోలెడు అప్పుల్లోకి వెళ్లారట. అప్పుల కారణంగా మొహం చాటేసుకు తిరిగే పరిస్థితి. పాత కమిట్‌మెంట్‌తో ఆయనకు ఓ ఏరియా హక్కులు దొరికాయి. బంగారపు గని దొరికినట్లయింది. అప్పుల వాళ్లను పిలిచి బాకీ తీర్చారట. బాహుబలి విడుదల వల్ల థియేటర్ల సంగతి ఎలా ఉన్నా, సైకిల్‌ స్టాండ్‌లు, క్యాంటీన్లు భయంకరంగా ఆదాయం చేసుకున్నాయి. కొందరు కార్లు కొన్నారని, కొందరు స్థలాలు కొన్నారని రకరకాల కబుర్లు వినిపిస్తుంటాయి  ఇండస్ట్రీలో.

బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌, సెకెండ్‌ పార్ట్‌లో రెండింటిలోనూ అసోసియేట్‌ అయిన బయ్యర్లలో సాయి కొర్రపాటి ఒకరు. దర్శకుడు రాజమౌళి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన.  ఇంత బజ్‌ వచ్చాక ఎవరన్నా ఎక్కువ డబ్బులు పెట్టి సెకెండ్‌ పార్ట్‌ కొంటారు. కానీ బజ్‌ అంతగా లేనపుడే ఫస్ట్‌పార్ట్‌ను మూడు, నాలుగు ఏరియాలకు కొన్నారు. నభూతో నభవిష్యతి అన్నట్లు రూపొందింది బాహుబలి అని ఆయ‌న‌ వివ‌రించారు.

బాహుబలి-2 అమ్మకాలు

ఇండస్ట్రీలో వినవస్తున్న వార్తల ప్రకారం బాహుబలి 2 ఆంధ్ర, నైజాం అమ్మకాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తరాంధ్ర      -13 కోట్లు

ఈస్ట్‌          -11 కోట్లు

వెస్ట్‌              -9,5 కోట్లు

కృష్ణ              -9 కోట్లు

గుంటూరు     -12 కోట్లు

నెల్లూరు        -5.5 కోట్లు

సీడెడ్‌    -25 కోట్లు

నైజాం    – 45 (అడ్వాన్స్‌)

మొత్తం ఏపీ తెలంగాణ -130 కోట్లు