ఏపీ కేబినెట్‌లో 5 గురు అవుట్ – 11 మంది ఇన్‌

యేడాదిన్న‌ర కాలంగా ఊరించి ఊరించి వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న కూర్పు ఎట్ట‌కేల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ముందు నుంచి అంద‌రూ ఊహిస్తున్న‌ట్టుగానే ఐదుగురు మంత్రుల‌కు చంద్ర‌బాబు ఉద్వాస‌న ప‌లికారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, చిత్తూరు జిల్లా నుంచి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్‌బాబు, అనంత‌పురం జిల్లా నుంచి ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డిని త‌ప్పించారు.

ఇక కొత్త‌గా కేబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 11 మంది లిస్ట్ ఇలా ఉంది.

– చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌తో పాటు ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్‌రెడ్డికి చోటు ద‌క్కింది.

– శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావు

– విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి సుజ‌య్‌కృష్ణ రంగారావు

– ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి కేఎస్‌.జ‌వ‌హ‌ర్

– గుంటూరు జిల్లా నుంచి న‌క్కా ఆనంద్ బాబు

-నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి

– క‌ర్నూలు జిల్లా నుంచి భూమా అఖిల‌ప్రియ

– క‌డ‌ప జిల్లా నుంచి ఆదినారాయ‌ణ‌రెడ్డి

– అనంత‌పురం జిల్లా నుంచి కాలువ శ్రీనివాసులు

– అనంత‌పురం జిల్లా నుంచి చాంద్ బాషా

సామాజిక కూర్పు ఇదే…

ఇక 11 మంది కొత్త మంత్రుల్లో 1 క‌మ్మ‌, 1 వెలమ‌, 2 ఎస్సీ, 1 మైనార్టీ, 4 రెడ్లు, 1 తూర్పు కాపు, 1 బీసీ (బోయ‌)కు చోటు క‌ల్పించారు.