వెంకీ రెమ్యున‌రేష‌న్ కేవలం ఆ రైట్స్

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మార్కెట్ ఇటీవ‌ల బాగా డౌన్ అయిన‌మాట వాస్త‌వం. వెంకీ మ‌హేష్ అండ‌తో ఎస్‌వీఎస్‌తోను, ప‌వ‌న్ అండ‌తో గోపాల‌…గోపాల సినిమాతోను రూ.50 కోట్ల క్ల‌బ్‌లో అయితే చేరాడు కాని సోలో హీరోగా మాత్రం అనుకున్న స్థాయిలో పెర్పామ్ చేయ‌ట్లేదు. వెంకీ చివ‌రి చిత్రం బాబు బంగారం రూ.20 కోట్ల షేర్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇక తాజాగా వెంకీ రీమేక్ మూవీ గురుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

ఈ సినిమాలో న‌టించినందుకు గాను వెంకీ రెమ్యున‌రేష‌న్ ప‌రంగా చిత్ర‌మైన డీల్ కుద‌ర్చుకున్నాడు. గురు శాటిలైట్ రైట్స్ మాత్ర‌మే వెంకీ తీసుకున్నాడు. సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మ‌లేదు. సురేష్‌బాబు ఓన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ మాత్రం మాంచి రేటుకు అమ్మేశారు. ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ గురు శాటిలైట్ రైట్స్‌ను రూ.6 కోట్ల‌కు కొనేసింద‌ట‌.

సో ఈ లెక్క‌న వెంకీ ఖాతాలో రూ.6 కోట్ల రెమ్యున‌రేష‌న్ వ‌చ్చి ప‌డింది. అంటే గురు సినిమాకు వెంకీ రెమ్యున‌రేష‌న్ రూ. 6 కోట్లు అన్న‌మాట‌. ఇక ఈ సినిమాకు వెంకీ ఇచ్చిన డేట్లు కూడా చాలా చాలా త‌క్కువ‌. కొన్ని సీన్లు త‌మిళ సినిమాలో నుంచి తీసుకునేలా స్క్రిఫ్ట్ ద‌శ‌లోనే ప్ర‌త్యేకంగా కేర్ తీసుకున్నారు.