రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనా..!

బాహుబ‌లితో రాజ‌మౌళి ఐదేళ్ల య‌జ్ఞం పూర్తైపోయింది. 2013 ఏప్రిల్‌లో స్టార్ట్ అయిన బాహుబ‌లి మ‌హాయ‌జ్ఞం ఏప్రిల్ 28తో ముగియ‌నుంది. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక కూడా రాజ‌మౌళి మ‌రో రెండు నెల‌ల పాటు ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు ఇత‌ర‌త్రా అంశాల‌తో వార్త‌ల్లోనే ఉంటాడు. ఆ త‌ర్వాత మూడు నాలుగు నెల‌లు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటాడు. మ‌రి ఆ త‌ర్వాత రాజ‌మౌళి ప్రాజెక్టు ఏంటి ? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో సైతం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

దీనిపై రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా బాహుబ‌లి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సాధార‌ణంగా రాజ‌మౌళి సినిమా ఫంక్ష‌న్ ల‌కు త‌న‌కు సంబంధించిన వాళ్లు.. లేదంటే సినిమాకు ప‌ని చేసిన వాళ్లు కాకుండా బ‌య‌టి వాళ్లు రారు.

బాహుబ‌లి 2 ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు సైతం అంతా ఈ సినిమాకు ప‌నిచేసిన వాళ్లే వ‌చ్చారు. కానీ ఈ సినిమాతో సంబంధం లేని నేచుర‌ల్ స్టార్ నాని సైతం ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చాడు. నాని హీరోగా 25వ సినిమా మైలురాయికి చేరువ‌వుతున్నాడు. ఇక ఇప్పుడు రాజ‌మౌళి కూడా నెక్ట్స్ ఏదైనా చిన్న హీరోతో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 త‌ర్వాత గ్యాప్ తీసుకుని రాజ‌మౌళి నానితో ఈగ 2 ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి టీం కూడా ఈగ 2 కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని కూడా ఈగ 2 పై హింటిచ్చాడు. మొత్తానికి ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే రాజ‌మౌళి నెక్ట్స్ హీరో నాని అనుకోవ‌చ్చేమో..?