బాహుబ‌లి -2కు అక్క‌డ బిజినెస్ లేదా..!

ఈ హెడ్డింగ్ చూస్తే ఎవ‌రైనా చాలా లైట్ తీసుకుంటారు… బాహుబ‌లి 2కు బిజినెస్ లేక‌పోవ‌డం ఏంటి ? ఆ సినిమాకు డౌన్ అవ్వ‌డం ఏంట‌ని షాక్ అవుతారు. బాహుబ‌లి 2 సాధిస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఈ సినిమా మీద ఈ నెగిటివ్ ప్ర‌చారం ఏంట‌ని అనుకోవ‌చ్చు. అయితే క‌ర్నాట‌క‌లో బాహుబలి 2 విష‌యంలో ఇప్పుడిదే జ‌రుగుతోంది.

బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. తొలి భాగం ఎంత వసూలు చేసిందో, దానికి కాస్త అటుగానే రెండో భాగం రేటుగా ఫిక్స్ చేసి అమ్మకాలు జరిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల వ‌ర‌కు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల‌ లెక్క‌లు చెపుతున్నాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను అమ్మ‌కాలు కంప్లీట్ అయినా ఇంకా కర్నాట‌క‌లో మాత్రం పెండింగ్‌లో ప‌డింది.

అక్క‌డ కూడా సినిమాకు సూప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాకు క‌ర్నాట‌క‌లో ముందు నుంచి ఏదో ఒక స‌మ‌స్య వ‌చ్చిప‌డుతోంది. బాహుబ‌లి 2 సినిమాను క‌న్న‌డ లాంగ్వేజ్‌లోకి డ‌బ్ చేసేందుకు క‌న్న‌డీగులు ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు అక్క‌డ టిక్కెట్ల రేట్ల‌పై ప్ర‌భుత్వం కొర‌డా ఝులిపించింది. తాము విధించిన రేట్ల‌కు మించి అమ్మే వీలులేద‌ని తెగేసి చెప్పింది.

అక్క‌డ బాహుబ‌లి 2ను ప్ర‌భుత్వం చెప్పిన రేట్ల‌కు అమ్మితే బ‌య్య‌ర్లు ఎవ్వ‌రూ గ‌ట్టెక్క‌రు. దీంతో అక్క‌డ బ‌య్య‌ర్లు బాహుబ‌లి నిర్మాత‌లు చెప్పిన రేటును పెండింగ్‌లో పెట్టారు. డీల్ ఇంకా ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. బాహుబ‌లి 1 అక్క‌డ రూ.40 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు 2కు కూడా రూ.45 కోట్లు ప‌లుకుతోంది. అక్క‌డ రేట్లపై ప్ర‌భుత్వం రూల్స్ పెట్ట‌డంతో ఇప్పుడు అక్క‌డ బ‌య్య‌ర్లు వెన‌క్కు త‌గ్గుతున్నారు.దీంతో అక్క‌డ బాహుబ‌లి 2 బిజినెస్ స్పీడ్‌గా లేదు.