బాహుబ‌లిని దాటేసిన ఖైదీ….చిరు కామెడీ లెక్క‌లు

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ, 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 వ‌సూళ్ల‌పై ముందునుంచి అనుమానాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి వ‌సూళ్ల విష‌యంలో మెగా క్యాంప్ నానా హంగామా చేసేసింది. ఫ‌స్ట్ డే అయిన వెంట‌నే అల్లు అర‌వింద్ ప్రెస్‌మీట్ పెట్టి ఖైదీ ఫ‌స్ట్ డే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47 కోట్లు వ‌సూలు చేసింద‌ని చెప్పారు. అర‌వింద్ అయితే ఖైదీ వ‌సూళ్ల‌పై ప‌దే ప‌దే మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యి బాగా ఓవ‌ర్ ప‌బ్లిసిటీ చేసేశారు.

ఇక ఖైదీ ఏకంగా రూ.105 కోట్ల షేర్ రాబ‌ట్టింద‌ని కూడా చెప్పుకున్నారు. చివ‌ర‌కు చిరంజీవి కూడా ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్‌లో అత్య‌ధిక గ్రాస‌ర్ మాదే అంటున్నాడు. `సింగిల్ లాంగ్వేజ్‌`లో అనేది అండ‌ర్ లైన్ చేస్తున్నాడు. అంటే కేవ‌లం తెలుగులో మాత్ర‌మే రిలీజ్ అయ్యి ఇన్ని కోట్లు సాధించిన ఏకైక చిత్రం ఇదే అని వాళ్ల లెక్క‌.

మ‌రి మెగా క్యాంప్ లెక్క‌లు ఇలా ఉంటే బాహుబ‌లి ఏమైపోయిన‌ట్టు అన్న ప్ర‌శ్న రాక‌మాన‌దు. బాహుబ‌లి తెలుగులోనే కాదు, మిగిలిన అన్ని భాష‌ల్లోనూ విడుద‌లైంది క‌దా ? అన్న‌ది మెగా అభిమానుల లాజిక్ అట‌. ఈ లెక్క‌న ఓన్లీ తెలుగులో మాత్ర‌మే రిలీజ్ అయిన ఖైదీ బాహుబ‌లి వ‌సూళ్లు క్రాస్ చేసేసింద‌ట‌.

ఖైదీ వ‌సూళ్ల విష‌యంలో మెగా అభిమానుల లెక్క‌లు చూస్తే కామెడీ అనిపించ‌క‌మాన‌వు. ఒక్క తెలుగు వెర్ష‌న్ మాత్ర‌మే తీసుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌సి బాహుబ‌లి రూ.113 కోట్లు సాధించింది. ఖైదీ కేవ‌లం రూ.80 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఓవ‌ర్సీస్‌లో బాహుబ‌లి ఏకంగా రూ.45 కోట్ల పైచిలుకు సాధిస్తే.. ఖైదీ నెం.150 రూ.13 కోట్ల‌కే ప‌రిమిత‌మైంది.

లెక్క‌లు ఇంత ప‌క్కాగా ఉండ‌గా మ‌రి చిరుతో పాటు మెగా అభిమానులు తెలుగులో అత్య‌ధిక గ్రాస‌ర్ మాదే అని ఎందుకు డ‌ప్పు కొట్టుకుంటున్నారో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.