ప‌ట్టిసీమ‌లో ఫ్రాడ్ గుట్టు ర‌ట్టు చేసిన కాగ్‌

ప‌ట్టిసీమ ప్రాజెక్టుతో చంద్ర‌బాబు చెప్పిన గొప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క ప్రాజెక్టుతో దేశంలోనే న‌దుల అనుసంధాన్ని తొలిసారిగా పూర్తిచేసిన ఘ‌త‌న త‌న‌దే అని ఆయ‌న ఓ రేంజ్‌లో భ‌జ‌న చేసుకున్నాడు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం త‌వ్విన కాల్వ‌ల‌ను వాడుకుని ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో గోదావ‌రి నీళ్ల‌ను ప్ర‌కాశం బ్యారేజ్‌కు త‌ర‌లించిన చంద్ర‌బాబు స‌ర్కార్ కృష్ణా – గోదావ‌రి న‌దుల అనుసంధానం అంటూ చేసుకున్న చెక్క‌భ‌జ‌న అంతా ఇంతా కాదు.

అయితే ఈ ప్రాజెక్టులో చాలా ఫ్రాడ్ జ‌రిగిందంటూ కాగ్ చంద్ర‌బాబు స‌ర్కార్‌ను క‌డిగి పాడేసింది. సీఎం చంద్ర‌బాబుతో పాటు ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును ఓ రేంజ్‌లో క‌డిగేసింది. ఇప్ప‌టికే స‌ర్కార్ మెగా ఇంజ‌నీరింగ్ కంపెనీతో కుమ్మ‌క్కు అయ్యి ఈ ప్రాజెక్టులో భారీ దోపిడి చేసిన‌ట్టు ఆధారాల‌తో స‌హా వెల్ల‌డైనా కూడా ప్ర‌భుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూ వ‌స్తోంది.

అయితే ఇప్పుడు ఏకంగా కాగ్ స్వ‌యంగా ప‌ట్టిసీమ ప్రాజెక్టులో జ‌రిగిన ఫ్రాడ్‌ను బ‌ట్ట‌బ‌య‌టు చేయ‌డంతో ప్ర‌భుత్వం ఏం చేయాలో దిక్కుతోచ‌క డైల‌మాలో ప‌డింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 357 కోట్ల రూపాయల ప్రజధనాన్ని కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టారని కాగ్ నివేదిక పేర్కొంది. టెండ‌ర్ ప్రీమియం గ‌రిష్ట పరిమితి పెంచ‌డంతో పాటు పోల‌వ‌రం కుడి కాలువు డిస్ట్రిబ్యూట‌రీల పూర్తి కాకుండానే అధిక టెండ‌ర్ల‌కు ప్రీమియంల‌తో ప‌నులు అప్ప‌గించ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాపై రూ.199 కోట్ల భారం ప‌డింద‌ని కాగ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డైంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టిసీమ ప్రాజెక్టు అంతా స‌క్ర‌మ‌మే అని గొప్ప‌లు పోయిన చంద్ర‌బాబు స‌ర్కార్‌కు కాగ్ నివేదిక‌తో పెద్ద షాకే త‌గిలిన‌ట్ల‌య్యింది. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు, ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమ ఇందుకు ఎలా స్పందిస్తారో చూడాలి.