లోకేశ్‌కు ఆ రెండు శాఖ‌లు క‌న్‌ఫార్మేనా..!

ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఆశావాహులు, ఉద్వాస‌న లిస్టులో ఉన్న వారికి టెన్ష‌న్ పెరిగిపోతోంది. ప్రస్తుతం మంత్రివర్గం 20 మంది ఉండగా,ఆ సంఖ్యను 26 వరకూ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్ర‌స్తుతం ఉన్న వారి నుంచి ఐదుగురు అవుట్ అవుతార‌న్న సంకేతాలు కూడా ఇప్ప‌టికే ఆయా మంత్రుల‌కు చేరిన‌ట్టు తెలుస్తోంది. అవుట్ అయ్యే వారు ఐదుగురు, కొత్త‌గా ఎంట్రీ ఇచ్చే వారు 6గురితో క‌లుపుకుంటే మొత్తం బాబు కేబినెట్‌లో 11 మంది వ‌ర‌కు కొత్త మంత్రులు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి.

ఇక అంద‌రూ ఎన్నో రోజులుగా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ పేరు ఇన్ జాబితాలో ఫ‌స్ట్ పేరుగానే ఉండ‌బోతోంది. ఈ జాబితాలో రెండో పేరు భూమా అఖిల‌ప్రియ‌ది. మిగిలిన వారు ఎవ‌రెవ‌రు ఉంటారా అన్న‌దానిపై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌ని స‌మాచారం.

ఇక లోకేశ్ కేబినెట్‌లో ఏయే శాఖ‌లు తీసుకుంటార‌న్న‌దానిపై కూడా ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్టే తెలుస్తోంది. ఐటీతో పాటు పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల‌ను లోకేశ్‌కు ఇస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పంచాయ‌తీ రాజ్ లోకేశ్‌కు ఇస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ శాఖ‌ను చూస్తోన్న మంత్రి అయ్యన్న‌పాత్రుడికి కోత ప‌డిన‌ట్టే. అప్పుడు అయ్య‌న్న‌కు మ‌రో శాఖ ఇవ్వ‌డం చేయాలి.

ఇక కొత్త మంత్రులు అంద‌రూ ఏప్రిల్‌ 2వ తేదీ ఉదయం 9 గంటల 25 నిమిషాలకు ముహుర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతి సచివాలయం ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు