గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ కాస్ట్‌లీ గిఫ్ట్‌..!

ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య‌.. అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు! ముఖ్యంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్‌ను స‌రైన మార్గంలో గైడ్ చేస్తూ మార్గ‌ద‌ర్శిలా ఉన్నారు న‌ర‌సింహ‌న్‌!! అంతేగాక ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నా.. కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అప‌వాదునూ మూట‌గ‌ట్టుకున్నారు. అయితే త‌న‌కు ఎంత‌గానో అండ‌గా నిలిచిన న‌ర‌సింహ‌న్‌కు ఇప్పుడు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. గ‌వ‌ర్న‌ర్ ప‌దవీకాలం ముగుస్తుండ టంతో ఆయ‌న‌కు మ‌ధుర జ్ఞాప‌కంలా నిలిచిపోయే బ‌హుమ‌తి ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

గవర్నర్ నరసింహన్ అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు విపరీతమైన అభిమానం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గవర్నర్ నరసింహన్.. సీఎం కేసీఆర్ కు అండగా నిలిచారు. ముఖ్యమంత్రికి సరైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అందుకే సీఎం కేసీఆర్..ఆయనను గురువుగా భావిస్తారు. అందుకే కేసీఆర్ ఎప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లినా ఆయనకు పాదాభివందనం చేస్తున్నారు. దీంతో నరసింహన్ కు కూడా కేసీఆర్ అంటే చాలా అభిమానం ఏర్పడింది. మరికొన్ని రోజుల్లో నరసింహన్ టర్మ్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తాను గురువుగా భావించే నరసింహన్ కు గురుదక్షిణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారని టాక్.

అదేంటంటే.. హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో ఒక ఎకరా విస్తీర్ణంలో దాదాపు 50 కోట్ల విలువైన రాజభవాన్ని సీఎం కేసీఆర్.. నరసింహన్ కు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయట. మూడేళ్లపాటు తనకు అండగా నిలిచిన ఆయనకు…. ఈ మాత్రం భారీ గురుదక్షిణ ఇవ్వాల్సిందేనని కేసీఆర్ గట్టిగా అనుకుంటు న్నారట. గవర్నర్ నరసింహన్ పదవీ విమరణ చేసిన తర్వాత హైదరాబాద్ లోనే నివాసం ఉండబోతున్నారని టాక్. సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లే ఆయన భాగ్యనగరంలోనే శాశ్వతంగా నివాసం ఉండేందుకు అంగీకరించారట.

హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు క‌నుక ఈ ఖ‌రీదైన భ‌వ‌నాన్ని ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే పోలీస్ ఉన్నతాధికారిగా విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించిన ఆయన… ఈ భారీ కానుకను తీసుకుంటారా అన్నది అనుమానమే. మ‌రి తీసుకుని శిష్యుడిని సంతృప్తి ప‌రుస్తారో లేక నిరాశ‌పరుస్తారో వేచిచూడాల్సిందే!!