సొంత కులాన్ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం పాలిటిక్స్‌లో సామాజిక వ‌ర్గాల జోరు భారీ ఎత్తున సాగుతోంది. వాస్త‌వానికి సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే పాలిటిక్స్ నిల‌బ‌డే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆపార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీ అయినా.. సామాజిక వ‌ర్గాల‌కు అగ్ర‌తాంబూలం ఇస్తున్నాయి. అయితే, దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు ఏపీసీఎం చంద్ర‌బాబు. రెండో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఆయ‌న త‌న పార్టీలో త‌న సామాజిక వ‌ర్గ‌మైన క‌మ్మ‌ల‌కు ప్రాతినిధ్యం ఇవ్వ‌డం లేద‌నే టాక్ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న త‌న సామాజిక వ‌ర్గానికే పార్టీలో పెద్ద పీట వేస్తార‌ని అంద‌రూ భావిస్తారు. కానీ, తెలంగాణ విష‌యానికి వ‌చ్చే స‌రికి బాబు వ్యూహం మార్చారు.

 తెలంగాణ‌లో జిల్లాల సంఖ్య ఇప్పుడు 10 నుంచి 31కి పెరిగింది. దీంతో ఆయా కొత్త జిల్లాల్లో టీడీపీకి కొత్త‌గా అధ్య‌క్షుల‌ను నియ‌మించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో రంగంలోకి దిగిన చంద్ర‌బాబు, తెలంగాణ పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌తో క‌లిసి ప‌క్కాప్లాన్ ప్ర‌కారం ఆయా జిల్లాల్లో అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఏ ఒక్క‌రినీ అధ్య‌క్షులుగా నియ‌మించ‌లేదు. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. నిజానికి తెలంగాణలో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపించే స్వంత సామాజికవర్గాన్ని ‘చంద్రబాబు’ పక్కన పెట్టడం గ‌మ‌నార్హం.

అయితే, సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేశామని రమణ ప్రకటించారు. అయితే మొత్తం జనాభాలో 7%  ఉన్న ‘కమ్మ’లకు కనీసం ఒక్క కొత్త జిల్లాలో కూడా పదవి ఇవ్వలేదు. తాజాగా ప్ర‌క‌టించిన కొత్త‌ అధ్యక్షుల్లో ఎక్కువ మంది ‘రెడ్డి ‘వెలమ’ సామాజికవర్గాలకు చెందిన వారే ఉన్నారు.  దీంతో అంద‌రూ ఇప్పుడు ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్నారు. నిజానికి బాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని నియ‌మిస్తే.. రానున్న ఎన్నిక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే స‌మాచారం అందింద‌ని తెలుస్తోంది.

దీనికి కార‌ణంగా ఇప్పుడు తెలంగాణ‌లోఅధికారంలో ఉన్న కేసీఆర్‌.. వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. ఇక‌, ప్ర‌భుత్వంలో రెడ్డి వ‌ర్గం డామినేష‌న్ ఉంది. దీనిని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపార‌ని, ఈ రెండు వ‌ర్గాల వారికి జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా తెలంగాణ‌లో ఎక్కువ‌గా ఉన్న ఈ రెండు వ‌ర్గాల వారినీ టీడీపీ వైపు తిప్పుకోవ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. దీంతోనే ఆయ‌న క‌మ్మ వ‌ర్గాన్నిప‌క్క‌న‌పెట్టార‌నే టాక్ కూడా విన‌వ‌స్తోంది. మ‌రి బాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో.. వేచి చూడాలి.