తెలంగాణ టీడీపీలో కుదుపు.. సీనియ‌ర్ నేత ఆ పార్టీలోకి జంప్‌!

తెలంగాణ‌లో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింది.  ఆ పార్టీ ఇప్ప‌టికే  కేడ‌ర్ లేక‌, సీనియ‌ర్లు జంప్ చేసి ఇలా అనేక ర‌కాల ఇబ్బందుల్లో ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డంపై ఇప్ప‌టికే అనేక ర‌కాలుగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2019 నాటికి కొంత స‌మ‌యం ఉండ‌డం ఆయా ప్లాన్‌ల‌ను అప్ప‌టిలోగా అమ‌లు చేయాల‌ని, ముఖ్యంగా కేడ‌ర్ జారిపోకుండా చూసుకోవాల‌ని ఆయ‌న స్థానిక త‌మ్ముళ్ల‌కు గ‌ట్టి ఆదేశాలిచ్చారు. అయితే, పార్టీ ఇప్ప‌ట్లో […]

టీటీడీపీ నేతలు చేసేది ఏమిలేక స్క్రిప్టుని చెత్త బుట్టలో పడేశారా!

ఎవ‌డు కొడితే.. దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడేరా.. పండు గాడు! ఇది ఓ మూవీలో మ‌హేష్ బాబు డైలాగ్‌. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేసి చూపించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. నిత్యం ఏదో ఒక విష‌యంపై కేసీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్న తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు కేసీఆర్‌! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. తెలంగాణలో భారీ భూ క‌బ్జా ఒక‌టి తెర‌మీ ద‌కి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక […]

టీ టీడీపీలో ముదిరిన ముసలం

తెలంగాణ తెలుగుదేశంలో ముస‌లం ముదిరిపోయింది. నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. కొంత‌కాలంగా టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై  ప్రెసిడెంట్ ఎల్‌.ర‌మ‌ణ తీవ్రంగా అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. దీంతో ఆయ‌న సైకిల్ దిగి కారెక్కే సూచ‌న‌లు ఉన్నాయ‌ని పుష్క‌లంగా ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇది ఇప్పుడు నిజం కాబోతోంద‌ట‌. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయింద‌ట‌. ముఖ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లితో ర‌మ‌ణ ప్ర‌త్యేక సంప్ర‌దింపులు జ‌రిపిన నేప‌థ్యంలో గులాబీ ద‌ళంలో క్లారిటీ వ‌చ్చింద‌ట‌. […]

రేవంత్ బీజేపీ-కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వేస్తోంది ఎవ‌రు..?

తెలంగాణ‌లో అధికారంలో టీఆర్ఎస్ ఉంటే అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ఉన్నా, మిగిలిన ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ-ఎంఐఎం-సీపీఎం-సీపీఐ ఈ పార్టీల‌న్ని కూడా అక్క‌డ ప్ర‌తిప‌క్షాలుగానే ఉన్నాయి. ఇక్క‌డ ఎన్ని పార్టీలు ఉన్నా…ఎంత మంది ప్ర‌తిప‌క్ష నేత‌లు ఉన్నా అధికార టీఆర్ఎస్ – సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి విసిరే పంచ్‌ల‌కు ఉండే క్రేజే వేరు. తెలంగాణ‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు […]

సెంటిమెంట్ రాయుడిగా మారిన రేవంత్‌రెడ్డి

ఇటీవ‌ల రాజ‌కీయాలు సెంటిమెంట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్య‌మం నుంచి ఈ సెంటిమెంట్ ఎక్కువైపోయింది.  ఈప‌ని ప్రారంభించాల‌న్నా కొబ్బ‌రికాయ ప‌గ‌లాల్సిందే! నుదుటిన వీర తిల‌కం దిద్దాల్సిందే టైపులో ప్ర‌తి ప‌నికీ సెంటిమెంట్‌తో ముడి పెడుతున్నారు. తాజాగా తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సెంటిమెంట్ రాయుడిగా మారిపోయారు! నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్ని, చంద్ర‌బాబుని ఎంత‌గానో న‌మ్మిన రేవంత్ ఇప్పుడు.. కేవ‌లం సెంటిమెంట్‌ను మాత్ర‌మే న‌మ్ముతున్నారు. అదే త‌న‌కు క‌లిసివ‌స్తోంద‌ని బ‌హిరంగంగానే రేవంత్ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల […]

సొంత కులాన్ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం పాలిటిక్స్‌లో సామాజిక వ‌ర్గాల జోరు భారీ ఎత్తున సాగుతోంది. వాస్త‌వానికి సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే పాలిటిక్స్ నిల‌బ‌డే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆపార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీ అయినా.. సామాజిక వ‌ర్గాల‌కు అగ్ర‌తాంబూలం ఇస్తున్నాయి. అయితే, దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు ఏపీసీఎం చంద్ర‌బాబు. రెండో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఆయ‌న త‌న పార్టీలో త‌న సామాజిక వ‌ర్గ‌మైన క‌మ్మ‌ల‌కు ప్రాతినిధ్యం ఇవ్వ‌డం లేద‌నే టాక్ ఇప్పుడు […]

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎవ‌రు..!

తెలంగాణ టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ న‌డుస్తున్నాయా?  పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మ‌ధ్య విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయా? ఈ విష‌యంలో రేవంతే దూకుడు మీదున్నాడా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం టీటీడీపీలో ఈ విష‌యంపైనే చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీ అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లోనూ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. తెలంగాణ పార్టీకి సీనియ‌ర్ నేత‌, బీసీ వ‌ర్గానికి చెందిన ఎల్‌.ర‌మ‌ణను అధ్య‌క్షుడిగా నియ‌మించారు. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాల‌ను అంద‌రూ […]

ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ వెన్నులో వణుకు తప్పదు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను జంప్‌ జిలానీలుగా వ్యవహరిస్తున్నాం. వాళ్ళందరికీ ఇప్పుడు హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో వెన్నులో వణుకు మొదలైంది. తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు స్పందించిన న్యాయస్థానం, తెలంగాణ స్పీకర్‌కి స్పష్టమైన సూచనలు చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని. హైకోర్టు తీర్పుపై స్పీకర్‌ స్పందించి, తమపై అనర్హత వేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోననే బెంగతో తల్లడిల్లుతున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. వీరిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా ఉన్నారు. […]

విశ్వగుంతల నగరంపై కెటియార్‌ నజర్‌.

విశ్వనగరం హైదరాబాద్‌ విశ్వ గుంతల నగరంగా మారిపోయిందని నిన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. దాంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం బయల్దేరింది. రోడ్లపై మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్‌ రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి రేవంత్‌రెడ్డి, ఇతర టిడిపి నాయకులు సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. విపక్షం చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి గ్రేటర్‌ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. పరిస్థితిని అంచనా […]