కోమటిరెడ్డి ప్రతీక్‌ది హత్యా?

2011 డిసెంబర్ 21న నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు.ఈ ప్రమాదం లో ప్రతీక్ తో పాటు అతని స్నేహితులు సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

అప్పట్లో అది రోడ్డు ప్రమాదమని,ప్రతీక్ రెడ్డి వాహనం పటాన్‌చెరు వైపు వెళ్తుండగా రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను తప్పించబోయి వాహనం అదుపుతప్పి సర్వీసు రోడ్డు పక్కనున్న మట్టి, రాళ్ల కుప్పను ఢీకొని కారు ఎగిరిపడిందని తేల్చారు.ప్రమాదం లో ప్రతీక్ మృతదేహం రోడ్డుకు 20 అడుగుల దూరంలో పడింది.పొలిసు రికార్డ్స్ లో ఇది రోడ్డుప్రమాదం గానే ఉండిపోయింది.

అయితే గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత ఒక్కొక్కరుగా బయట వస్తున్న బాధితుల్లో తాజాగా వ్యాపారి గంపా నాగేందర్ నాయీమే కోమటిరెడ్డి కుమారుడ్ని హత మార్చాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది.5 కోట్లివ్వకపోతే రోడ్డు ప్రమాదంలా కనిపించేలా తన కుమారుల్ని కూడా నయీమ్ చంపుతానని బెదిరించాడని.అదే టైం లో కోమటి రెడ్డి కుమారుడి మరణం ప్రమాదం కాదని అది నేనే చేయించానని నయీమ్ చెప్పినట్టు నాగేందర్ తెలిపాడు.

అయితే సినీఫక్కీలో విగ్గులు..రకరకాల వేషధారణలు చిత్ర విచిత్రమైన ప్రవర్తన కలిగివుండే నయీమ్..కేవలం వ్యాపారుల్ని బెదిరించడానికి ఇటువంటి ఎత్తుగడలని ఎంచుకుని ఉంటాడని అందులోను కోమటిరెడ్డి వంటి బడా రాజకీయనాయకులయితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని అలా చేసుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు.అదీకాక కోమటిరెడ్డి కుమారుడి వాహనం వేరే వాహనాన్ని గుద్ది ప్రమాదం బారిన పడలేదు.కేవలం మేకల్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం తెలిసింధే.కాబట్టి కోమటిరెడ్డి కుమారుడిది కేవలం రోడ్డు ప్రమాదంగానే చూడాలి తప్ప ప్రి ప్లాన్డ్ మర్డర్ అనడానికి అంత స్ట్రాంగ్ బేస్ లేదు అన్నది వాస్తవం.