కవిత కౌంటర్ అదిరింది

నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం.హస్తిన రాజకీయాలతోనే కవిత బిజీ బిజీ గా గడుపుతోంది.ఎప్పుడో అడపా దడపా తెలంగాణా జాగృతి తరపున ఇక్కడ కనిపిస్తోందంతే.

దీనికి కారణం లేకపోలేదు.రాష్ట్రంలో తన తండ్రి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.ప్రతిపక్షం అనేదే లేకుండా నిర్వీర్యం చేసేసారు.ఏదయినా చిన్న చితకా ఇబ్బందులుంటే అన్న కేటీర్,బావ హరీష్ రావు లు చక్కదిద్దేస్తున్నారు.ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఎక్కువయినా..ప్రతి పక్షాలకు కళ్లెం వేయలేనంతగా గొంతెత్తున్నా కవిత నాన్నకు నేనున్నా అంటూ ఎప్పుడూ ముందుంటుంది.

తెలంగాణా ప్రభుత్వం చేసుకున్న మహా ఒప్పందం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న తరుణం లో కవిత చాలా ఘాటుగా..అంతే విశ్లేషణాత్మకంగా కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.రేవంత్ రెడ్డి కి అధిష్టానం అమరావతి లో వుంది..ఆయనెప్పుడూ ఆంధ్ర మ్యాప్ చూస్తారేమో ఒక సారి తెలంగాణా మ్యాప్ కూడా చూస్తే తెలుస్తుంది మహా రాష్ట్ర తో మనం ఎందుకు ఒప్పందం చేసుకోవాలో అని.ప్రాజెక్ట్ కి ఒక వైపు తెలంగా ఒక వైపు మహారాష్ట్ర ఉంటే ఒప్పందం మహారాష్ట్ర తో కాకా ఆంధ్రప్రదేశ్ తో చేసుకోవాలా అని ఛలోక్తులు విసిరారు..రేవంత్ రెడ్డి గారూ విన్నారా..మరి..సమాధానం చెప్పండి సర్..

ఇంక ప్రభుత్వానికి లేఖ రాసిన ఎల్ రమణకి గట్టిగానే జవాబిచ్చింది కవిత.. ఆయనేమంటాడు .. కేంద్రంతో మాట్లాడి మహారాష్ట్ర ఆధీనం లో ఉన్న భూమిని గుంజుకుంటే సరిపోయేదా..అదే మాకు మీ నాయకుడు చంద్రబాబుకి తేడా..మేము బాగుండాలి..మా పక్కోడు కూడా బాగుంపడాలనుకునే వాళ్ళం మేము అంతే కానీ కేంద్రంతో మాట్లాడి..ఖమ్మం జిల్లాలోని 7 మండలాలని ఆంధ్ర లో కలిపినట్టు మమ్మల్ని కూడా అన్యాయంగా మహారాష్ట్రకు ద్రోహం చేయమని చెప్పడం ఏమి నీతని ప్రశ్నించారు.అయినా విమర్శించడం కూడా రాకపోతే ఎలా రమణ గారూ..మీ విమర్శలోనే అవతలివాళ్ళకు ఆయుధాన్ని ఇచ్చేస్తే ఇలానే ఉంటుంది.

ఇక ఫైనల్ గా బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ని సైతం కవిత వదల్లేదు.మేము చారిత్రిక ఒప్పందం చేసుకొస్తే లక్ష్మణ్ గారు మహారాష్ట్ర సీఎం కి ధన్యవాదాలు చప్తు పోస్టర్లు పెట్టడం ఏ సంస్కృతి అని ప్రశ్నించారు కవిత..అయినా లక్ష్మణ్ కి చేతనయితే కాళేశ్వరం కి జాతీయహోదా తీసుకొచ్చి మాట్లాడాలన్నారు కవితా..ఇదేం పని లక్ష్మణ్ గారూ..ఎవరో పెళ్ళికి మీరు భాజాలు కొట్టుకోవడం ఎం పద్ధతి లక్ష్మణ్ సాబ్.

అదేంటో గాని..కెసిఆర్ అండ్ ఫామిలీ కి ప్రతిపక్షంలో వున్నా ఎదురుండదు..ప్రభుత్వం లో వున్నా ఎదురే ఉండదు.ప్రతిపక్షాలు ప్రభుత్వ పనితీరుని ఎండగట్టాలి..అయితే ఎడా పెడా అయిన దానికి కానిదానికీ ఆరోపణలు చేయకూడదు..చేసేముందు బాగా పేపర్ వర్క్ చేసి విమర్శిస్తే బెటర్..లేకపోతే కౌంటర్ ఎటాక్ ఇలాగే ఉంటుంది మరి.