హామీలే త‌ప్ప అమ‌లు ఏదీ?

విశ్వనగరం వైపు వడివిడి అడుగులేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో భారీ పథకాలకు టీఆర్ఎస్ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందులో బాగంగా గత ఏడాది ఆర్దిక సంవత్సరం సర్కారు హామీలు పోను జీహెచ్ఎంసీ కి 1200 కోట్లు రూపాయలు ఆస్తి పన్ను రూపంలో ఆధాయం సమకూరింది. అయితే ఈ నిధులను ప్రభుత్వం బల్దియాకు కాకుడా సర్కారు పథకాలకు మళ్లించింది. దీంతో ఒక్క సారిగా జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఏర్పడింది. దానిక తోడు ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో ప్రకటించిన 425 కోట్ల రూపాయల్లో కేవలం 25 కోట్లు మాత్రమే మంజూరూ చేసింది. ఆ నిధులన్నీ నగరంలో దెబ్బలన్నీ రోడ్ల రిపేర్లకు….పరిపాలన అవసరాలకు వినియోగించారు.

ఒక్కసారిగా ఖజానా ఖాళీ కావడంతో జీహెచ్ఎంసీ ప్రకటించిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ పథకం, డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణం, గ్రేటర్ లో సీసీ రోడ్లు, వైట్ టాపింగ్ రోడ్లతో పాటు మూసి ప్రక్షాళన, మూసి ఈస్ట్ వెస్ట్ ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణం, నగరంలో పలు రోడ్లపై ప్లే ఓవర్ల.. పనులు ఇప్పుడు వేల కోట్ల నిధులకోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుకు శంఖు స్థాపన చేసి నెలలు గడుస్తున్న ఆ పథకం పూరోగతి లేకుండా పోయింది. వీటికి ప్రత్యామ్నాయ పద్దతిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని, రోడ్లు జంక్షన్లలో వన్ వే మార్గాలు, ఫ్రీ లెఫ్ట్, సిగ్నల్ ప్రీ యూ టర్న్ లు డైవర్షన్లు, తెరపై కి తీసుకురావడంతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు మరో ఏడాది పాటు పట్టాలెక్కే దారి కన్పించడం లేదు. ఇక అధికార పార్టికి బల్దియా ఎన్నికల్లో బ్రహ్మరంథం పట్టి విజయాన్నందించిన డబుల్ బెడ్ రూం పథకం నిదులు కోరతతో మద్యలోనే ఆగిపోయింది. దీనికి అవసరమైన భూసమీకరణ…పూర్తవుతున్న నిధుల లేమి జీహెచ్ఎంసీ కి సమస్యగా మారింది. దీంతో జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు సేకరించి ఇండ్లు నిర్మాణం చేస్తామని ప్రభుత్వుం చెబుతోంది.

ఎస్ఆర్డీపీ కి ఇరవై ఐదు వేల కోట్లు …ఈ సంవత్సరం ఓక్కో ఇంటికి 9 లక్షల చొప్పున .. లక్ష బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం 9 వేల కోట్ల రూపాయలు .మూసి నతీ ప్రక్షాళన కోసం 3 వేల కోట్లు, మూసీ ఈస్ట్ వెస్ట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక రోడ్ల కోసం వెయి కోట్ల రూపాయలు అవసరం అవుతయాని మున్సిపల్ శాఖా మంత్రికి నివేదికలు ఇచ్చారు. బ్రిక్స్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం రుణాలు సేకరించాలని నిర్ణయించిన నేపద్యంలో ఆ నిధుల్లో కొంత జీహెచ్ఎంసీ కి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు జీహెచ్ఎంసీ పై హైదరాబాద్ అర్బన్ ఆర్టీసీ నష్టాల భారం భరించాలని సీఎం కేసీఆర్ స్వయంగా అదేశాలివ్వడంతో ఏటా 300 కోట్లు అదనపు భారం పడనుంది. ఆర్ధిక భారం నుంచి బయట పడటానికి ప్రతినెల జీహెచ్ఎంసీ ఆస్తీ పన్ను వసూల్లు పెంచుకోవడానికి లక్షల్లో బహుమతులు ఇచ్చి కోట్లలో ఆస్తీ పన్నద్వారా ఆదాయం సమకూర్చుకోంటోంది.