రెండేళ్ళు ఫిక్స్ అయిన చరణ్

‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టాడు రాంచరణ్‌. ఆ సినిమా ప్రారంభోత్సవం దగ్గర్నుంచీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి చూసుకున్నాడు . ఇక తండ్రి సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. దాంతో తన సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నుంచీ చరణ్‌ రెండేళ్లదాకా ఖాళీగా ఉండడట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు సినిమాల్ని చేసెయ్యనున్నాడు. ఇప్పటికే వీటన్నింటికీ కథల్ని సిద్ధమయిపోయాయట. ప్రస్తుతం ‘తనీ ఒరువన్‌’ రీమేక్‌ ‘ధృవ’లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో సినిమా ఖాయమయ్యింది.

సుకుమార్‌తో సినిమా చేస్తూనే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో గానీ బోయపాటి శ్రీనుతో సినిమా చేసే అవకాశం ఉందటని సమాచారమ్‌. ఇంకో డైరెక్టర్‌ కొరటాల శివతో సినిమాను పెండింగ్‌లో పెట్టాడట. ఇవే కాక టైమ్‌ దొరికితే క్రిష్‌ సినిమాకి కూడా ఓకే చెప్పేస్తాడట. ఈ రకంగా కొంచెం కూడా ఖాళీ లేకుండా షూటింగ్స్‌తో గడపాలని చరణ్‌ నిర్ణయించుకున్నాడట. ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలు అందించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడట ఈ మెగా పవర్‌స్టార్‌. ఇంకేం ఇలా అయితే మెగా ఫ్యాన్స్‌కి పండగే పండగ. చరణ్‌ ఇలా నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తాడంటే కాదనేదెవరు? కీప్‌ ఇట్‌ అప్‌ చరణ్‌!