టీడీపీ, వైసీపీకి బిగ్ ఫైట్.. సమ్మర్ పరీక్ష అదే

ఆంధ్రప్ర‌దేశ్‌లో మ‌రో బిగ్ ఫైట్‌కు తెర‌లేవ‌నుంది. ఎమ్మెల్సీల కోటాలో మొద‌లైన ఈ ఎన్నిక‌ల యుద్ధం.. ఇంకా కొన‌సాగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో పెండింగ్‌లో ఉన్న‌ మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మ‌ధ్య మ‌రో సంగ్రామం త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా రెండేళ్ల పాల‌న‌కు ఇవి రెఫ‌రెండంగా టీడీపీ భావిస్తుండ‌గా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల ప‌డాల‌ని వైసీపీ భావిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో […]

ఏపీలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే విన్న‌ర్ ఎవ‌రు..!

రాష్ట్రం ఆర్థికంగా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అధికారం చేప‌ట్టినా… త‌న స‌మ‌ర్థ‌త‌, సుదీర్ఘ రాజ‌కీయ, పాల‌నానుభ‌వం, స‌మ‌యానుకూల‌ వ్యూహాలే పెట్టుబ‌డిగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాష్ట్ర ప‌రిస్థితిని ఓ ర‌కంగా గాడిలో పెట్ట‌గ‌లిగార‌నే చెప్పాలి.  అయితే తాను రాత్రిప‌గ‌లు తేడా లేకుండా కుటుంబాన్ని కూడా మ‌ర‌చిపోయి.. రాష్ట్రం కోసం శ్ర‌మిస్తున్నా.. అందుకు త‌గిన స్థాయిలో టీడీపీ ప్ర‌భుత్వానికి మైలేజీ రావ‌డం లేద‌ని చంద్ర‌బాబు పార్టీ అంత‌ర్గత చ‌ర్చ‌ల్లో వాపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.. దానికితోడు […]

జ‌గ‌న్ స‌వాల్‌తో బాబు ఇరుకున ప‌డ‌తాడా..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డం, నేత‌ల వ‌రుస‌ వ‌ల‌స‌ల‌తో బ‌ల‌హీన‌ప‌డిన త‌న పార్టీ క్యాడ‌ర్‌లో తిరిగి ఆత్మ‌స్థైర్యం నింప‌డ‌మే ల‌క్ష్యంగా   వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ భారీ పొలిటిక‌ల్ గేమ్‌కు తెర తీయ‌బోతున్నారా… అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధాన‌మిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవ‌డంపై ఇటు టీడీపీని, అంటు బీజేపీని ఇర‌కాటంలో పెట్ట‌డంద్వారా త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ‌కు బాట‌లు వేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రానికి హోదా ఇవ్వ‌క‌పోతే […]

2019లో తెలంగాణలో వార్ ఇలా ఉంటుందా..!

స‌రిగ్గా రెండున్న‌రేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌పుడు ఆ పార్టీ పైనా.., పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పైనా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. కాంగ్రెస్ ఆడిన రాజ‌కీయ జూదంలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురుత‌న్ని.. ప‌రిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలించ‌డంతో… ఏదో గాలివాటంగా అధికారంలోకి వ‌చ్చింద‌ని భావించిన‌వారే రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అధిక‌శాతం. నిజానికి అందులో వాస్త‌వం లేక‌పోలేదు. […]

కన్నా వైసీపీ లోకి కన్ఫర్మ్

మాజీ మంత్రి, వైఎస్ కి రాజ‌కీయ స‌న్నిహితుడ‌యిన క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌స్తుతం రాజ‌కీయంగా కొంత సందిగ్ధంలో ఉన్నారు. సుదీర్ఘ‌కాలం పాటు కాంగ్రెస్ రాజ‌కీయాల‌లో చక్రం తిప్పిన క‌న్నా మొన్న‌టి ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌మ‌లం గూటికి చేరారు. కాంగ్రెస్ కి భ‌విష్య‌త్తు లేద‌ని నిర్ణ‌యించుకుని కాషాయం గూటికి చేరితే ఇప్పుడా పార్టీ ప‌రిస్థితి కూడా అయోమ‌యంగా మారుతోంది. దేశంలో మోడీ గ్రాఫ్ ప‌డిపోవ‌డ‌మే కాకుండా..ప్ర‌త్యేకంగా ఏపీలో పువ్వుపార్టీకి పుట్టెడు క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌త్యేక […]

జగన్‌ కొత్త గెటప్‌ వెనుక రాజకీయ కోణం

అధికారంలో ఉన్నవారెవరైనాసరే కులమతాలకతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని మతాల పండుగల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఆయా మతాచారాల ప్రకారం వ్యవహరిస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవారికి అవన్నీ చేయాలని రూలు ఏమీ లేదు. ఆయా మతాల పండుగల్లో పాల్గొనడం వేరు, ఆ మతాచారాల్ని పాటించడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, క్రిస్టియానిటీని విశ్వసిస్తారు. అలాగని ఆయన ఇతరమతాలకి వ్యతిరేకి కాదు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లి, ‘విశ్వాసం’ తెలపలేదనే […]

ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

దాసరి అక్కడ వెతుక్కుంటున్నారేమో

పాపులారిటీని దాసరి నారాయణరావు రాజకీయాల్లో వెతుక్కోవాలని అనుకుంటున్నారు. ఈ తరం దర్శకులతో పోటీ పడలేకపోతున్నారు ఆయన. తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా దాసరి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నా, నేటితరం సినిమాలు వేరు. ప్రేక్షకుల అభిరుచి మారింది. అప్‌డేట్‌ కాలేకపోవడమే దర్శకత్వంపై దాసరి శీతకన్నేయడానికి కారణం. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి దాసరి మద్దతు పలికారు. మద్దతుతోనే సరిపెట్టకుండా కాపు సామాజిక ప్రముఖులందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చి, నాయకత్వం వహించడం జరుగుతోంది. ఇదంతా […]

జగన్ కు షాక్ ఇవ్వనున్న బడా ఇన్వెస్టర్‌!!

ఆయ‌న వైసీపీకు బాగా ప‌ట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులంద‌రికి పెద్ద ఇన్వెస్టర్‌. వైకాపా కార్యక్రమాల‌కు, ఆ పార్టీ నాయ‌కుల‌కు ఎప్పుడైనా ఎంత డ‌బ్బు కావాల‌న్నా క్షణాల్లో స‌మ‌కూరుస్తారు. జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మక‌స్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రిత‌మే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ త‌ర‌పున రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో నాలుగో వ్యక్తిగా బ‌రిలో నిల‌వాల‌ని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం క‌లిసి ఈ అంశంపై చ‌ర్చించారు. […]