హోం మంత్రి రాజ‌ప్ప‌కు టీడీపీ క‌న్నా కుల‌మే ఎక్కువా..!

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు ఎన్నిక‌లు త‌మ‌కు చావో రేవోగా రెండూ పార్టీలు పోరాడాయి. రెండు చోట్ల టీడీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. కాపు ఉద్య‌మం ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండ‌డంతో కాకినాడ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్ష‌న్ సీఎంగా చంద్ర‌బాబుకు ఎక్క‌వుగానే క‌నిపించింది. ఇక్క‌డ కాపులంద‌రూ కూడా వార్ వ‌న్‌సైడ్ చేసేసి టీడీపీని గెలిపించారు. […]

నిన్న బాబు ద‌గ్గ‌ర హీరో… నేడు జీరో

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్ ముందు నిన్న‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఓ మంత్రి నేడు జీరో అయిపోయాడా ? ఆయ‌నకు అప్ప‌గించిన కీల‌క బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణలో ఫెయిల్ అవ్వ‌డంతో పాటు స‌ద‌రు మంత్రి చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌న్ను బాబు, లోకేష్ ద‌గ్గర జీరో చేశాయా ? అంటే ఏపీ పాలిటిక్స్ ఇన్న‌ర్ స‌ర్కిల్‌లో వినిపిస్తోన్న విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు, లోకేష్‌కు డిప్యూటీ […]

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి

కేంద్రంలోను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. మోడీ వేవ్ బాగుండ‌డంతో మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడైనా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోవాల‌న్నంత ఉత్సాహంతో కేసీఆర్ ఉన్నారు. ఏపీలో మాత్రం నంద్యాల ఫ‌లితం ముందు వ‌ర‌కు ముంద‌స్తుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డ సీఎం చంద్ర‌బాబు నంద్యాల‌లో టీడీపీ భారీ మెజార్టీతో గెల‌వ‌డంతో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను వార్ టీడీపీకి […]

ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గంటా 2009 ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్డు జడ్జి మంత్రికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. 2004 ఎన్నిక‌ల్లో చోడ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. […]

టీడీపీలో ఆయ‌న ఎక్క‌డుంటే అదృష్టం అక్క‌డే!

కొంద‌రికి అదృష్ణం అయ‌స్కాంతం అంటుకున్న‌ట్లు అంటుకుంది. న‌క్క‌తోకను తొక్కితే.. కూడా అలాంటి అదృష్టం రాదు. ముఖ్యం రాజ‌కీయాల్లో ఇలా అదృష్టం ఉన్న‌వాళ్లు చాలా త‌క్కువ మందే ఉంటారు. కానీ ఆయ‌న‌ ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు.. రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి వెన‌కాలే నీడ‌లా అదృష్టం తోడుంటోంది. ప‌ట్టింద‌ల్లా బంగారంలా మారుతోంది. ఆగ‌స్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగ‌రేయ‌డం అంటే.. ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. అందులోనూ మంత్రిగా సొంత‌జిల్లాలో ఇలాంటి అవ‌కాశం రావ‌డ‌మంటే […]

బాబు ఏరి కోరి తెచ్చుకుంటే బ‌ల్లెమ‌వుతున్న‌ మంత్రి!

ఇప్ప‌టికే మంత్రుల‌పై విప‌రీత‌మైన ఆరోప‌ణ‌లు.. ఒక‌రితో ఒక‌రికి స‌ఖ్య‌త లేకపోవ‌డం.. ఇలా సీఎం చంద్ర‌బాబుకు మంత్రుల వ‌ల్ల త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఇక తాజాగా మ‌రో మంత్రిపై ఆయ‌న‌కు ఫిర్యాదులు అంద‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇసుక మాఫియా, డ్ర‌గ్ మాఫియా.. ఇలా ఏపీలో ఆయిల్‌ మాఫియా కూడా చెల‌రేగుతోంద‌నే విమ‌ర్శ‌లు జోరందుకుం టున్నాయి. అంతేగాక దీనికి ఒక మంత్రి అండ‌గా నిలుస్తున్నార‌ని, క‌మీష‌న్లు తీసుకుంటూ దందాల‌కు పాల్ప‌డుతు న్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. ఈ విష‌యంపై పారిశ్రామిక […]

ఏపీ విద్యాశాఖా మంత్రిగా అనిత‌..?

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో మ‌రోసారి కేబినెట్ విస్త‌రిస్తారో లేదో తెలీదు గాని.. ఈసారి మాత్రం చాలా మంది `మంత్రి` ఆశ‌లు పెట్టేసుకున్నారు. `ఇదే ఎన్నిక‌ల టీం` అని సీఎం చంద్రబాబు కూడా ప్ర‌క‌టించేశారు. గ‌తంలో మంత్రి ఆశించి తీవ్రంగా భంగ‌ప‌డిన వారిలో ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసో డ్‌తో ఒక్కసారిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె.. మంత్రి ప‌ద‌విపైనే చాలా ఆశ‌లు పెట్టేసుకున్నారు. అయితే స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఆమెకు ద‌క్క‌లేదు. […]

మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కుల ఈక్వేష‌న్లే ఎప్పుడూ కీల‌క‌పాత్ర పోషిస్తుంటాయి. ఇక్క‌డ కులాల లెక్క‌లే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేస్తుంటాయి. ప‌శ్చిమ‌ డెల్టాలో కాపులు వ‌ర్సెస్ శెట్టిబ‌లిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బ‌లం మెండు. పెనుగొండ నుంచి ఒక‌సారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు […]

గంటాను వ‌దిలించుకుంటోన్న బాబు

ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయ‌నకు ఒకే పార్టీలో ఉండి రాజ‌కీయాలు చేయాల‌న్న సూత్రం ఏదీ ఉండ‌దు. ప్ర‌తి ఎన్నిక‌కు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా ప‌లు పార్టీలు మారి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న టీంతో క‌లిసి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గంటాకు జిల్లాలో […]