అరెస్టుల పర్వం..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలని అరెస్టుల పర్వం షేక్ చేస్తుంది. ఇంతకాలం ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ అధికార పార్టీలు రాజకీయం చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..అధికార పార్టీ నేతలే ఇప్పుడు అనూహ్యంగా కేసుల్లో ఇరుక్కున్న పరిస్తితి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కీలక నేతలు అరెస్టు అవుతారనే ప్రచారం సంచలనంగా మారింది. తెలంగాణలో సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత..ఇటు ఏపీలో సి‌ఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ప్రచారం […]

కవితతో కేసీఆర్ పోలిటికల్ గేమ్..వ్యూహం మార్చేస్తారా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అందులో కీలకంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇక ఈ స్కామ్ లో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారని, ఆమె పేరు ఈడీ రిపోర్టులో […]

ఈటల మళ్ళీ ‘కారు’లోకి..కేసీఆర్ మ్యాజిక్?

మాటలతో మాయ చేసే విషయంలో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ లేరనే చెప్పాలి. ఎలాంటి వ్యతిరేక పరిస్తితులు ఉన్న వాటికి అనుగుణంగా మార్చుకోవడంలో ఆయన్ని మించిన వారు లేరు. ప్రత్యర్ధులని సైతం మెప్పించగల వాక్చాతుర్యం ఆయనకు ఉంది. తాజాగా అలాంటి వాక్చాతుర్యంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అధికార బి‌ఆర్‌ఎస్ నేతలు, ముగ్గురే ఉన్న బి‌జే‌పి నేతల మధ్య పెద్ద మాటల […]

బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవ‌రికి న‌ష్టం.. ?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో అధికారం లోకి వ‌చ్చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైనాట్ 175 నినాదంతో మ‌రోసారి విజ యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే.. ఏపీలో రెండు ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయం ఊపందుకుంది. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబుతున్నాడు. ఈ క్ర‌మంలో టీడీపీ-జ‌నసేన క‌లిస్తే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని […]

మోదీ టార్గెట్‌గానే..ఖమ్మంలో కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయిందా!

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభకు భారీగా జనం తరలివచ్చేలా చేయడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఇతర జాతీయ నేతలు రావడంతో..సభ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఆ ముగ్గురు సీఎంలతో పాటు కేసీఆర్..కేవలం కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటానికి […]

ఎర్రబెల్లి లెక్కలు..20 ఎమ్మెల్యేలని మార్చాలా?

తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అలాగే తెలంగాణలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కారు పార్టీకి అంత ఈజీనా అంటే? చెప్పడం కష్టమే. తెలంగాణలో గులాబీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పికప్ అయితే […]

కేసీఆర్‌కు చెక్..పొంగులేటి ట్విస్ట్ మామూలుగా లేదు.!

తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఈయనకు..అక్కడ అనుకున్న విధంగా ప్రాధాన్యత దక్కలేదు..అలాగే కీలక పదవులు రాలేదు. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ రానున్న రోజుల్లో సీటు పై గ్యారెంటీ లేదు..దీంతో పొంగులేటి కారు పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది. అది కూడా […]

కేసీఆర్‌కు టచ్‌లో ఏపీ ఎమ్మెల్యేలు..సంక్రాంతి తర్వాత..!

ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో పలువురు కీలక నేతలని బీఆర్ఎస్ లో చేర్చారు. రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్ అధికారి తోట చంద్రశేఖర్..తాజాగా హైదరాబాద్‌కు వెళ్ళి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇదే క్రమంలో పలువురు కాపు […]

బీఆర్ఎస్‌లోకి తోట..ఏపీలో కేసీఆర్ కాపు లెక్క..?

బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీలో పార్టీని విస్తరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీ ఆఫీసుని విజయవాడలో పెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. పార్టీలోకి పలువురు కీలక నేతలని చేర్చుకోనున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇక ఈయనకే ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నారు. గతంలో ప్రజారాజ్యం, ఆ తర్వాత […]