ఆ యుద్ధ‌క్షేత్రంపై జ‌గ‌న్ గురి..!

ఏపీ రాజ‌ధాని జిల్లా గుంటూరు ల‌క్ష్యంగా వైకాపా అధినేత జ‌గ‌న్ భారీ ఎత్తున రాజ‌కీయానికి తెర‌దీస్తున్నారా? ఈ జిల్లాను టార్గెట్ చేయ‌డం ద్వారా టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్నారా? ప‌్ర‌స్తుతం రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయిన వైకాపాను జిల్లా మొత్తం విస్త‌రించాల‌ని ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారా? అంటే తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజ‌కీయాల్లో గుంటూరు జిల్లా గుండెకాయ వంటిది. అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌హా మంత్రులు ప‌త్రిపాటి […]

వైకాపాలో మాజీ సీఎం మ‌న‌వ‌డు

ఏపీ పొలిటిక‌ల్ పార్టీల్లోకి నేత‌ల చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌ర ఏళ్ల స‌మ‌యం ఉన్నా కూడా.. నేత‌లు ఇప్ప‌టి నుంచే త‌మ స్టేజ్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కాక‌లు తీరిన కాంగ్రెస్ యోధుడు, మాజీ సీఎం దివంగ‌త కాసు బ్ర‌హ్మానంద రెడ్డి మ‌న‌వ‌డు కాసు మ‌హేష్ రెడ్డి విప‌క్ష వైకాపా లోకి జంప్ చేశారు. ఈయ‌న తండ్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కూడా అయిన‌ కాసు వెంక‌ట కృష్ణారెడ్డి ఇప్ప‌టికీ […]

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేష‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ రానున్న రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వాస్త‌వానికి న‌వంబ‌రు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని త‌మ‌కు చెప్పాల‌ని హైకోర్టు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు కావ‌డం, […]

టీడీపీలో మంత్రి వర్సెస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే

గుంటూరులో టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎవ‌రికి వారే త‌మ ఆధిప‌త్యం చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు తామే సొంతంగా వివిధ విభాగాల‌కు సంబంధించిన అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించేస్తున్నారు. స‌మావేశాలు పెట్టేస్తున్నారు. దీంతో అధికారుల్లో తీవ్ర అయోమయం నెల‌కొంటోంది. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌లు ఒక పార్టీ గొడుగు కిందే ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రికీ స‌మ‌న్వ‌య లోపంతో పాటు ఆధిప‌త్యం విష‌యంలోనూ […]

ఏపీ రాజ‌ధానిలో టీడీపీతో బీజేపీ క‌టిఫ్‌

2014 నుంచి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మ‌ధ్య రానురాను కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేకత కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల కాలంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం మ‌రింత‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత‌గా పెంచింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక‌, ఇప్పుడు ఇదే నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం విష‌యంలో గుంటూరు బీజేపీ నేత‌లు మ‌రింతగా కారాలు మిరియాలు నూర‌డంతోపాటు అస‌లు టీడీపీతోనే క‌టీఫ్ చెప్పేందుకు […]

మోదుగల హర్ట్ అయ్యార్ట…

రాజ‌కీయాలన్నాక నేత‌లు అల‌గ‌డం, వారిని అధిష్టానం బుజ్జగించ‌డం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో త‌న‌మాటకు విలువ లేకుండా పోయింద‌ని, త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేద‌ని స‌మాచారం. మ‌రి అంత‌గా ఆయ‌న అల‌గ‌డానికి […]

అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]