అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు ఐదు రాష్ట్రాలలో కలిపి 32 లక్షల మంది కస్టమర్లు, 8 లక్షల మంది ఎజెంట్లు ఉంటారని ప్రాథమిక అంచనా. బాధితులకు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్ధతు లెలిపారు. ఆప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోటంలో ట్రాఫిక్ భారీగా స్థంభించిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొంటున్నారు. తమకు వెంటనే స్పందించకపోతే ..సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని బాధితులు పేర్కొంటున్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. 20లక్షల మంది బాధితులు రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఏపీ మేధావుల సంఘం చలసాని ప్రసాద్‌ అన్నారు. హింసాత్మకంగా వెళ్లడం ఇష్టం లేకే.. శాంతియుతంగా తమ ఆవేదనన వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. అయినా బాధితుల ఆక్రోషాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని అన్నారు. మొదటగా బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.