చెడ్డపనులు చేయాలన్నది మానవ నైజం – చంద్రోపదేసం

ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూక్తులు , ముక్తాయింపులతో లేనిపోని వివాదాలు కొనితేచ్చుకోవటం ఆయనకీ పరిపాటిగా మారింది.తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు

సెక్రటేరియట్ ను పరిశీలించిన సీఎం ఏపీ ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అమరావతికి రావాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి వస్తాయని తేల్చిచెప్పారు.
పనిలో పనిగా మనవ నైజం గురించి, వ్యవస్థల గురించి ఉపన్యాసం దంచేసారు.ఛాన్స్ వస్తే చెడ్డపనులు చేయాలన్నది మానవ నైజం అని సీఎం వ్యాఖ్యానించారు. డబ్బు తేలిగ్గా సంపాదించాలని కూడా అనుకుంటారని, ఈ విషయంలో ప్రపంచంలోని మనుషులంతా ఒక్కటేనని అన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో వ్యవస్థలన్నీ అందరి చేత పనిచేయిస్తున్నాయని, ఇక్కడ మాత్రం సిస్టమ్స్ ఇష్టానుసారం వ్యవహరించేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి ఇలా అయిన దానికి కాని దానికి బురద నెత్తినేసుకోవడం, విషయం వివదాస్పం అవగానే నా మాటలు వక్రీకరించారనడం అలవాటైపోయింది పాపం.