కామ్రేడ్ల‌తో జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం..!

పొలిటిక‌ల్ పార్టీల‌న్నాక పొత్తులు, ఎత్తులు త‌ప్ప‌వు! ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి 2019 ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న పాల‌న‌కు మార్క్‌గా 2019 ఎన్నిక‌ల‌ను భావిస్తున్నారు. ఇక‌, విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్ ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు. ఇక‌, 2014లో పురుడు పోసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న పార్టీ జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని(పైకి చెప్ప‌క‌పోయినా?) య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు […]

ఏపీలో శ‌త్రువు… తెలంగాణ‌లో మిత్రువా..!

త‌న మాట‌ల మాయాజాలంతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌ట్టిప‌డేస్తూ, తిరుగులేని రాజ‌కీయ వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేసేస్తూ టీఆర్ఎస్‌ను తెలంగాణ‌లో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మార్చిన టీ ముఖ్య‌మంత్రిని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌టొకటిగా ఏక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టిదాకా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ఎవ‌రికివారుగా అధికార టీఆర్ఎస్‌పై పోరు సలుపుతుండ‌గా…ఒక‌ప్పుడు తెలంగాణ‌లో బ‌లంగా ఉండి ప్ర‌స్తుతం ప్రాబ‌ల్యం కోల్పోయిన సీపీఎం గ‌త వైభ‌వం సాధించాల‌న్న గట్టి ప‌ట్టుద‌ల‌తో  ఇప్పుడు రంగంలోకి దిగింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సంబంధించి, […]

బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర ప‌క్షం అనుకుంటున్న జ‌న‌సేనాని నుంచి కూడా కాక త‌గ‌ల‌నుందా?  అటు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, కామ్రేడ్లు స‌హా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూకుమ్మ‌డిగా బాబుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన గోదావ‌రి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్ర‌బాబు కొంప‌మీద‌కు వ‌స్తోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మ‌త్య్స కారుల‌కు అనువైన స‌ముద్ర ఉత్ప‌త్తుల […]

క‌మ్యూనిస్టుల వైభ‌వం.. గ‌త చ‌రిత్రేనా..?

ఒక‌ప్పుడు రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల‌కు రాజ‌కీయంగా చెప్పుకోద‌గిన స్థాయిలో ప‌ట్టుండేది. అధికారం చేజిక్కించుకోగ‌ల స్థాయిని ఏనాడూ చేరుకోలేక పోయినా… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ త‌మకంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగ‌లిగేవారు. ప్ర‌ధాన పార్టీల‌తో స‌మయానుకూలంగా పొత్తుల‌తో చ‌ట్ట స‌భ‌ల్లో త‌మ ప్రాతినిధ్యం ఉండేలా.. త‌మ వాయిస్ గ‌ట్టిగా విన‌ప‌డేలా చూసుకునేవారు. అయితే ప్రాంతీయ పార్టీల హ‌వా పెర‌గ‌డం.., వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించ‌లేక పోవ‌డం.., కాలం చెల్లిన విధానాల‌ను, పిడివాదాన్ని న‌మ్ముకోవ‌డంతో క‌మ్యూనిస్టుల బ‌లం త‌రిగిపోతూ వ‌చ్చింది. […]