బీజేపీకి కాకినాడ రిజ‌ల్టే…ఏపీలోను వ‌స్తుందా..!

మేం సొంతంగా ఎదుగుతాం. మాకూ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ ప‌థ‌కాలు మాకు పెద్ద ప్ల‌స్‌. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు, అవినీతికి వ్య‌తిరేక పోరాటం వంటివి మాకు ప్ర‌ధాన బ‌లాలు. ఏపీలో బాబు పంచ‌న ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మోచేతి నీరు తాగాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. ఇక‌, ప‌వ‌న్ నీడ అస్స‌లే అవ‌స‌రం లేదు. 2019 నాటికి మేం బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదుగుతాం. మాద‌గ్గ‌ర‌కే ఇత‌ర పార్టీలు రావాలి. అని నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

కాకినాడ కార్పొరేష‌న్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించింది. నిన్న‌టి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్క‌డ కూడా గెల‌వ‌డంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాల‌కు ముగిసింది. మొత్తం మూడు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. 48 డివిజ‌న్లలోను టీడీపీ 32 డివిజ‌న్లు, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థులు 3 […]

బీజేపీతో ఆట‌… ఇప్పుడు బాబు టైం వ‌చ్చిందా

2014లో జ‌ట్టు క‌ట్టి.. అప్ప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మ‌రింత గ‌ట్టి ప‌డుతుంద‌ని, బాబు మ‌రింత స‌న్నిహిత‌మ‌వుతార‌ని, బీజేపీ అండ‌కోసం బాబు మ‌రిన్ని అడుగులు ముందుకు వేస్తార‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమార‌య్యాయి. నంద్యాల ఉప పోరు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డం, జ‌గ‌న్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు న‌డ‌వ‌డం, 2014లో త‌న‌తో క‌లిసి వ‌చ్చిన ప‌వ‌న్ త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంబించ‌డంతో బాబు […]

కాకినాడ‌లో ఆ రెండు పార్టీల‌కు ఓటేస్తే మురిగిన‌ట్టేనా..!

అవును! ఇప్పుడు కాకినాడ ఓట‌ర్లు ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ప్రారంభ‌మైన కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక ఉద‌యం ఏడు గంటల నుంచి ప్ర‌శాంతంగా సాగిపోతోంది. ఓట‌ర్లు ఇక్క‌డ కూడా తండోప‌తండాలుగా పోలింగ్ బూత్‌ల‌కు క్యూ క‌డుతున్నారు. మ‌హిళ‌లు ఇళ్ల‌లో ప‌నులను వాయిదా వేసుకుని మ‌రీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ పార్టీకి ఓటేయాలి? అనేది కాకుండా.. ఏ పార్టీకి ఓటేస్తే.. మురిగిపోతుంది? త‌మ ఓటు విలువ లేకుండా పోతుంది? […]

పురందేశ్వ‌రిలో మార్పు వెన‌క మ‌రిది మీద ప్రేమ ఉందా..లేదా..!

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి! అన్న ఎన్టీఆర్ కుమ‌ర్తె అయినా.. త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన నాయ‌కురాలు. ప‌రుచూరు నుంచి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన ఈమె.. త‌న‌కంటూ ప్ర‌త్యేక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్నారు. అన్న‌గారు మ‌ర‌ణించే వ‌ర‌కు ఆమె భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండ‌గా, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆయ‌న తెర‌మ‌రుగ‌య్యారు. ముఖ్యంగా టీడీపీలో జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణామాల విష‌యంలో క‌ల‌త చెందిన పురందేశ్వ‌రి.. ఆ పార్టీ త‌న తండ్రి స్థాపించిన‌దే అయిన‌ప్ప‌టికీ.. […]

మ‌రో మోసానికి తెర‌లేపిన బీజేపీ

ప్ర‌త్యేక‌హోదా అని త‌ర్వాత ప్యాకేజీని ప్ర‌క‌టించి న‌మ్మించి మోస‌గించిన కేంద్రం.. మ‌రోసారి ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టేందుకురెడీ అవుతోంది. కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి వెంక‌య్య రాజీనామా చేసిన తర్వాత‌.. ఆ స్థానంలో ఎవ‌రిని నియ మించాల‌నే అంశంపై గ‌ట్టిగానే చర్చ జ‌రుగుతోంది. దీనిపై అటు టీడీపీ, ఇటు బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు తీవ్ర‌త‌రం చేస్తున్నాయి. మెత్త‌గా కొట్టి.. నొప్పి త‌గ్గ‌డానికి ఆయింట్‌మెంట్ రాసిన చందంగా.. వ్య‌వ‌హ‌రించాల‌ని బీజేపీ పెద్ద‌లు వ్యూ హాలు ర‌చిస్తున్నార‌ట‌. ముఖ్యంగా విశాఖ‌కు రైల్వే జోన్ […]

పురందేశ్వ‌రిపై కుట్ర వెన‌క ఆ ఇద్ద‌రు..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీలో ఎదిగేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆ పార్టీని ఆద‌రించేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎంత‌మాత్రం సిద్ధంగా లేరు. ఏపీలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీతోనో లేదా వైసీపీతోనో పొత్తు లేకుండా బీజేపీ వార్డు మెంబ‌ర్ సీటు కూడా సొంతంగా గెల‌వ‌లేదు. అది ఇక్క‌డ బీజేపీ స‌త్తా. ప్ర‌స్తుతం టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ రాజ‌కీయ స్వ‌లాభం కోసం అటు వైసీపీతో అయినా క‌లిసి వెళ్లేందుకు సిద్ధ‌మ‌న్న సంకేతాలు ఇస్తూ డ‌బుల్ గేమ్ ఆడుతోంది. […]

పార్టీ మార‌డంపై కామినేని ఒక్క‌సారిగా బర‌స్ట్

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస‌రావుపై గ‌త కొంత కాలంగా ఆయ‌న పార్టీ మార‌తాడ‌ని, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతాడ‌ని, అందుకే ఏపీలో బీజేపీ ఏమైపోయినా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. అంతేకాదు, ఇటీవ‌ల కాలంలో కొన్ని మీడియాల్లో అయితే, కామినేని చూపు టీడీపీ వైపు అంటూ క‌థ‌నాలు వ‌చ్చేశాయి. ఈ జోరు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో త‌ట్టుకోలేక పోయారో ఏమో .. […]

టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు క‌థ‌నాలు!

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు విమ‌ర్శ‌లే ఒక్కొక్క‌సారి ప‌నిచేయ‌వు.. వారిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న ఎల్లో మీడియా..  వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఈ వ‌ర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవ‌కాశం ఉంది.  అయితే, […]