బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం […]

సింగపూర్ సంస్థకు అమరావతి ఛాన్స్

కొత్త రాజధాని అమరావతి అభివృద్ధి అవకాశాన్ని సింగపూర్‌ కన్సార్టియంకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే సింగపూర్‌ సంస్థకు 58 శాతం ఈక్విటీని ఖరారు చేశారు. ఈ పెట్టుబడికి అదే స్థాయిలో ఆదాయాన్ని కూడా సమకోర్చాలని నిర్ణయిరచారు. సింగపూర్‌ సంస్థకే స్విస్‌ ఛాలెంజ్‌ ద్వారా రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించేందుకు దాదాపు నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థకు కల్పించాల్సిన ప్రయోజనాలపైనా అధికారులు విస్తృతంగా కసరత్తు చేశారు. గత నాలుగు రోజులుగా ఇదే అంశాలపై ఉన్నతాధికారులు […]

తడిచి మోపెడు అవుతున్న ఉద్యోగుల తరలింపుఖర్చు

ఉద్యోగుల తరలింపుఖర్చు ప్రభుత్వానికి తడిసి మోపెడు కానుంది. సచివాలయంలో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలకు మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. అదీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సాధ్యపడేలాలేదు. కాగా హెచ్‌ఓడిలకు సంబంధించి మీ కార్యాలయాలను మీరే వెతుక్కోండని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో రెట్టింపు అద్దెలతో లీజుల పందేరానికి తెరలేచినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు దళారులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. తరలింపు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉంటే మూడేళ్లపాటు ప్రైవేటు భవనాలకు లీజులు […]

వాయిదా పడ్డ అమరావతి ప్లాట్ల కేటాయింపు

ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు నేడు ప్లాట్లు కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎవరికి ఎక్కడ ప్లాట్ ఇస్తున్నదీ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తుళ్లూరు ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి […]

ముద్రగడకి మళ్ళీ నిరాశే

తుని విధ్వంసం ఘటనలో అరెస్టయినవారంతా విడుదలైతే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమిస్తారు. ఈ రోజే మిగిలిన ముగ్గురికి బెయిల్‌ రవచ్చని ముద్రగడ వర్గీయులు అంచనా వేశారు. బెయిల్‌ వస్తే, దీక్ష విరమణకి కూడా ఏర్పాట్లు చేయవచ్చనుకున్నారు. సొంత గ్రామం కిర్లంపూడిలోనే దీక్ష విరమణకోసం ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ ముగ్గురి బెయిల్‌ విషయంలో విచారణ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి […]

చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]

వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!

నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]

నారాయణా చాలించు నీ అమరావతి లీలలు.

అంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై ఆరు నెలలుగా అదిగో.. ఇదిగో.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పూర్తయిన వెంటనే గత డిసెంబరు 31 నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అప్పట్నించి ఇప్పటవరకూ వాయిదాల పరంపర కొనసాగుతోంది. తరువాత జనవరి 31 నుంచి అని ఒకసారి, మార్చి 31 నుంచి అని మరోసారి, మే 31 నుంచి అంటూ ఇంకోసారి ప్రకటించారు. చివరిగా ఈనెల 10 […]