పెళ్లై 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే లావ‌ణ్య‌కు బిగ్ షాకిచ్చిన వ‌రుణ్ తేజ్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ఉత్తరాఖండ్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. చాలా ఏళ్ల నుంచి ల‌వ్ చేసుకుంటున్న ఈ జంట‌.. న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో వేదిక‌లో ఏడ‌డుగులు వేశారు. వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అలాగే పెళ్లి అనంత‌రం న‌వంబ‌ర్ 5న హైద‌రాబాద్ లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ ఈ వేడుక‌లో సంద‌డి చేశారు.

అయితే పెళ్లై 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే లావ‌ణ్య త్రిపాఠికి వ‌రుణ్ తేజ్ బిగ్ షాకిచ్చింది. భార్య‌ను హ‌నీమూన్ కు తీసుకెళ్ల‌డం మానేసి.. ఒంట‌రిగా ఈ రోజు ముంబై ఫ్లైట్ ఎక్కేశాడు. పెళ్లి హ‌డావుడి పూర్తి కాక‌ముందే వ‌ర్క్ లో బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో మ‌ట్కా ఒక‌టి కాగా.. మ‌రొక‌టి ఆపరేషన్ వాలెంటైన్‌.

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ అయింది. యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ పైలెట్ గా క‌నిపించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ముంబైలో ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. ఇందులో భాగంగానే వ‌రుణ్ తేజ్ ముంబైకి వెళ్తూ.. ఎయిర్ పోర్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. భార్య‌తో హ‌నీమూన్ కు వెళ్లాల్సిన వ‌రుణ్‌.. పెళ్లైన వారానికి సినిమా ప‌నుల‌తో బిజీ అవ్వ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.