ఓటింగ్స్ ను తారుమారు చేసిన గౌతమ్ తల్లి… ఒక్క దెబ్బతో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నాడుగా…!!

కంటెస్టెంట్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఫ్యామిలీ వీక్ లో మాత్రం అవేవీ పట్టించుకోరు. తమ కన్నవారు, భార్య, పిల్లలను చూసి కంటతడి పెట్టుకుంటారు. రోజు గొడవ పడే ఇంటి సభ్యులు ఈ ఒక్క వారం మాత్రం ఎమోషనల్ అవుతారు. అంతేకాకుండా ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టిస్తారు. ఇక బిగ్ బాస్ పదో వారంలో ఫ్యామిలీ వీక్ మొదలైంది.

నిన్నటి ఎపిసోడ్లో శివాజీ, అర్జున్, అశ్విని ఇంటి సభ్యులు రాగా. నేడు గౌతమ్ తల్లి హౌస్ లోకి ఎంటర్ కానుంది. తన తల్లి ప్రేమ తన కొడుకుకి ఒక్కడికే కాకుండా మిగతా అందరికీ పంచి తన గొప్పతనాన్ని చాటుకుంది. అందరికీ గోరుముద్దలు తినిపిస్తూ అందరిలో ఎమోషన్ పుట్టించింది.

ఈ క్రమంలోనే యావర్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే.. ఓటింగ్స్ లాస్ట్ నున్న గౌతమ్ ని సెకండ్ ప్లేస్ కి తీసుకొచ్చింది తన తల్లి. తన ప్రేమను అందరికీ పంచి తమ బిడ్డని సేవ్ చేసింది. ఈ సందర్భంగా గౌతమ్ ప్లేస్ లో మరో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. గౌతమ్ వాళ్ళ తల్లి రావడం గౌతమ్‌ కి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.