త్వరలోనే తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాలలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ కార్తికేయ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా స్వయంభు అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగే కథాంశం అన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా కోసం దాదాపుగా మూడు నెలల పాటు యుద్ధ సన్నివేశాలను నిఖిల్ శిక్షణ తీసుకుంటున్నారు.. నిఖిల్ తన 20వ సినిమా కావడం చేత తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తూ ఉన్నారు అయితే ఇటీవల నిఖిల్ భార్య పల్లవి కూడా ప్రెగ్నెంట్ అయిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

2020లో డాక్టర్ పల్లవి పెళ్లి చేసుకున్న నిఖిల్.. పల్లవిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన భార్యతో ఒక ఫ్యామిలీ ఈవెంట్ కు వెళ్లగా అక్కడ బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు సైతం త్వరలోనే నిఖిల్ కూడా తండ్రి కాబోతున్నారనే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది .అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు వీరిద్దరు ఎలాంటి అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. మరో నటుడు శర్వానంద్ కూడా తండ్రి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.