బిగ్ బాస్ శోభా శెట్టికి కూడా లవర్ ఉన్నాడా.. అతడు కూడా సెలబ్రిటీనేగా..

తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ గ‌త కొన్ని వారాలుగా ఎంతో రసవతరంగా సాగుతుంది. ఈ సీజన్ అదిరిపోయే ట్విస్టులు ఇస్తూ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తున్నాడు బిగ్‌బాస్. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో చాలా వరకు ఉల్టా పల్టా సర్ప్రైజ్లు ఎదురయ్యాయి. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అంతా ప్రేక్షకులకు తెలిసిన వారే రావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో తెలుగు నంబర్ వన్ సీరియల్ కార్తీకదీపం నుంచి శోభ శెట్టి (మౌనిత) హౌస్ లోకి కంటిస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఈ సీరియల్ ద్వారా బలమైన విలన్‌గా ముద్ర వేసుకున్న శోభ బిగ్‌బాస్ హౌస్ లో కూడా స్ట్రాంగ్ కంటిస్టెంట్‌గా మారి మంచి మార్కులు కొట్టేసింది.

కాగ‌ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కంటిస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. కంటిస్టేంట్‌లకు ఫ్యామిలీలో ఇష్టమైన వ్యక్తులను లేదా ఫ్యామిలీ పర్సన్స్ ఎవరినైనా హౌస్ లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శోభ శెట్టి తండ్రిని, ఆమె లవర్‌ని బిగ్‌బాస్ వేదిక మీదకు తీసుకువచ్చారు. అయితే వీరిద్దరి మధ్యన గత మూడున్నరేళ్ళుగా రహస్య ప్రేమాయణం జరుగుతుందని.. నిన్న జరిగిన తాజా బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో రివిల్ అయింది. నాగార్జున అతడిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఈ రహస్య ప్రేమని అందరి ముందు పెట్టేస్తున్న అంటూ.. శోభ లవర్ మరెవరో కాదు సీరియల్ యాక్టర్ యశ్వంత్ అంటూ వేదిక‌పైకి పిలిచాడు.

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడు గా య‌శ్వంత్.. ఆదిత్య రోల్‌లో నటించాడు. ఇక వీరిద్ద‌రు మూడున్న‌ర ఏళ్ళుగా ప్రేమ‌లో ఉన్నారు. ఇప్పటికే పలు సీరియల్స్ లో కీరోల్ ప్లేచేసిన యశ్వంత్ బుల్లితెరపై మంచి ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక కవర్ సాంగ్ కూడా చేశారు. అయితే అతడు శోభా శెట్టికి మంచి ఫ్రెండ్ అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ వేదికపై లవర్స్ అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అయితే శోభ.. టేస్టీ తేజకు హ్యాండ్ ఇచ్చినట్టేనా. కేవలం పుటేజ్ కోసమే మీ ఇద్దరు లవ్ ట్రాక్ నడిపారా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు.