Bigg Boss: హౌస్ నుంచి బోలే షావలి ఎలిమినేట్.. అతని రెమ్యునరేషన్ ఎంతంటే..?

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ చివరి దశకు వచ్చేసింది. 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ కోసం కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. శివాజీ తప్పించి ఎవరు ఎలిమినేట్ అయ్యేది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. కాగా నిన్నటి ఎపిసోడ్ తో బోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. ఈయన 5 వారాల రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అత్య‌దిక టీఆర్‌పీతో కొనసాగుతుంది. అన్ని సీజన్ల‌లో కంటే భిన్నంగా ఈ సీజన్ ఉంది. ఎన్నో సర్ప్రైజ్‌ల‌తో స్టార్ట్ చేసిన బిగ్ బాస్ గతవారం అంత ఫ్యామిలీ వీకెండ్ పేరిట ఎమోషనల్ చేస్తాడు.

హౌస్ లోని ప్రతి ఒక్కరిని ఏడిపించాడు. అంతేనా చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తిగా జరిగింది. కాగా నామినేషన్ లో శివాజీ, యావర్, గౌతమ్, బోలే షావలి, రతికా రోజ్ ఉండగా అందరిలో ఈసారి నామినేషన్ నుంచి కచ్చితంగా రతికా రోజ్ ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ ఆమె తృటిలో తప్పింది. ఈవారం బోలె, యావర్, గౌతమ్, ర‌తికా డేంజర్ జోన్‌లో ఉండగా ఫ్యామిలీ వీక్ పేరు మీద యావర్ గౌతమ్ గట్టెక్కారు. వీరు ఫ్యామిలీలో హౌస్ లోకి ఎంటర్ ఇవ్వడం వీళ్ళకి బాగా ప్లస్ అయింది.

గౌతమ్ తల్లి యావర్‌కి తల్లి లేకపోవడంతో దగ్గరకు తీసుకుని హత్తుకొని ముద్ద‌లు తినిపించింది. శోభ‌శెట్టి తల్లి యావరకి ధైర్యం చెప్పింది. యావరు బ్రదర్ కూడా షోకి రావడం యావరికి మరింత ప్లస్ అయింది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంటర్ అయిన బోలె కేవలం 5 వారాలు మాత్రమే హౌస్ లో కొనసాగాడు. ఈ ఐదు వారాలకు ఆయన రూ.6.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే వారానికి రూ1.25 లక్షలు తీసుకున్నాడు. దీని బ‌ట్టి బిగ్‌బాస్ హౌస్‌లో షావ‌లికి రెమ్యున‌రేష‌న్ బానే ముట్టింది. అయితే బోలే షావలి క్రేజ్ రీత్యా అ రేమ్యునరేషన్ ఎక్కువనే చెప్పాలి.